బోయపాటి కనిపించడం లేదు

బోయపాటి మొదటినుండి తన పంధాలోనే అంటే మాస్ యాక్షన్ కలగలిపిన చిత్రాలతోనే బాగా హైలెట్ అయ్యాడు. భద్ర దగ్గరనుండి… తులసి, సింహ, లెజెండ్, సరైనోడు, జయ జానకి [more]

Update: 2019-01-25 02:42 GMT

బోయపాటి మొదటినుండి తన పంధాలోనే అంటే మాస్ యాక్షన్ కలగలిపిన చిత్రాలతోనే బాగా హైలెట్ అయ్యాడు. భద్ర దగ్గరనుండి… తులసి, సింహ, లెజెండ్, సరైనోడు, జయ జానకి నాయక, దమ్ము ఇలా ఏ చిత్రంలోనైనా యాక్షన్ కె అధిక ప్రాధాన్యతనిస్తాడు బోయపాటి. అలాగే ఆ యాక్షన్ లోనే కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్ చెయ్యగలడు. యాక్షన్ తో మిళితమైన కుటుంబ కథ చిత్రాలతో బోయపాటి మాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ఒక్కోసారి బోయపాటి యాక్షన్ మిస్ ఫైర్ అయినా.. చాలాసార్లు ఆ యాక్షన్ కే ప్రేక్షకులు పట్టం కట్టారు. అయితే బోయపాటి మొదటి సినిమా నుండి యాక్షన్ యాక్షన్ అంటుంటే. ఇప్పుడు ఎందుకు మారతాడు చెప్పండి.

రామ్ చరణ్ కి రంగస్థలం సినిమా విడుదలకు ముందు బోయపాటి తో సినిమా కమిట్ అయ్యాడు. కానీ రంగస్థలం సినిమా విడుదలయ్యాక చాలారోజుల వరకు బోయపాటితో సినిమా చెయ్యడం అంటే.. మాస్ యాక్షన్ మూవీ చెయ్యడం కరెక్టేనా.. కాదా.. అనే ఆలోచనలోనే చాలా రోజులు గడిపాడు. అయితే బోయపాటి ట్రాక్ రికార్డ్ కి యావరేజ్ టాకొచ్చినా చాలని చరణ్ ముందడుగు వేసాడు. మొదట్లో బోయపాటిని చిరు యాక్షన్ కాదు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెయ్యమని చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. కానీ తర్వాత బోయపాటి – చరణ్ మూవీ యాక్షన్ సీన్స్ కి అంతయ్యింది.. ఇంతయ్యింది అంటూ ప్రచారం మొదలైంది. ఇక టీజర్, లుక్, ట్రైలర్ చూసాక టైటిల్ వినయ విధేయరామ టైటిల్ కి సినిమాలోని కథకి సంబంధమే లేదని అర్ధమైంది. మరి సినిమా విడుదలైంది బోయపాటి.. తమ మార్క్ యాక్షన్ ని చూపెట్టాడు.

కానీ ప్రేక్షకులు మాత్రం ఈసారి బోయపాటి ని నో అన్నారు. నో అన్నా.. మాస్ ప్రేక్షకులు తలచుకుంటే ఏదైనా జరగొచ్చని…. వినయ విధేయరామ కలెక్షన్స్ నిరూపించాయి. అదిగో సినిమా విడుదలై నెగెటివ్ టాక్ రావడం మొదలు బోయపాటి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. బోయపాటి ఒక సక్సెస్ మీట్ పెట్టడం కానీ.. కనీసం వినయ విధేయరామ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. చరణ్ అయితే ఆ సినిమాని లైట్ తీసుకున్నాడు అందుకే కామ్ గా వున్నాడు. కానీ బోయపాటి మాత్రం తన నెక్స్ట్ మూవీ బాలకృష్ణ సినిమా పనుల్లో మునిగిపోయాడో లేదంటే ఇప్పుడు బయటికొస్తే అందరికి సమాధానం చెప్పాలనుకున్నాడో కానీ.. ఎవరికి అందుబాట్లో లేకుండా పోయాడు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి బోయపాటి దూరమైనట్లే అని వార్తలు కూడా వస్తున్నాయి.

మరోపక్క బాలకృష్ణ కూడా బోయపాటి తో సినిమా అన్నాడు కానీ…. ప్రస్తుతం కథానాయకుడు దెబ్బకి.. మహానాయకుడు మీద ఫోకస్ పెట్టి.. బోయపాటి తో టచ్ లోకి కూడా రావడం లేదని వినికిడి. మరి ఇలాంటి సమయంలో బోయపాటి బయట తిరగడం ఎందుకులే అని అజ్ఞాతంలోనే ఉండిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకే అందరూ బోయపాటి కనబడడం లేదంటున్నారు.

Tags:    

Similar News