వినయ విధేయ రామ కి ఆ భయం లేదు

టాలీవుడ్ కి పెద్ద పండగ సంక్రాంతి సీజన్ వచ్చేస్తుంది. సంక్రాంతి సీజన్ అంటే సినిమాలు క్యూ కడతాయి. ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచి [more]

Update: 2019-01-09 03:15 GMT

టాలీవుడ్ కి పెద్ద పండగ సంక్రాంతి సీజన్ వచ్చేస్తుంది. సంక్రాంతి సీజన్ అంటే సినిమాలు క్యూ కడతాయి. ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తారు. అందుకే ఈ సీజన్ లో ఎంత పోటీ ఉన్న సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. కానీ ఎక్కువ థియేటర్స్ దొరుకుతాయా లేదా అనేది టెన్షన్. తక్కువ థియేటర్స్ దొరికితే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. రికవరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి.

అయితే లక్కీగా ‘వినయ విధేయ రామ’ చిత్రం యువి వాళ్ల చేతుల్లో పడింది. వీరు ఆంధ్ర..తెలంగాణ రైట్స్‌ని గుత్తంగా కొనేసిన యువి సంస్థ ఆ తర్వాత మళ్లీ విడివిడిగా ఏరియాల వారీగా అమ్మింది. నైజాం, ఉత్తర ఆంధ్ర రైట్స్ ప్యాకేజ్‌ డీల్‌గా దిల్ రాజుకి ఇచ్చేసింది. దిల్ రాజు కి ఈ రెండు ఏరియాస్ లో గ్రిప్ ఉంది కాబట్టి థియేటర్స్ సమస్య ఉండదు. సినిమా కు మంచి టాక్ వస్తే వీర లెవెల్ లో ఉంటుంది.

అలానే దిల్ రాజు నిర్మించిన ‘F 2 ‘ చిత్రం కి కూడా సరిపడా థియేటర్లని దిల్‌ రాజు ముందే బ్లాక్‌ చేసుకున్నాడు. ఎటొచ్చీ బయోపిక్‌కే ఎక్కువ థియేటర్లు దొరకడం లేదు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చాలా తక్కువ థియేటర్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వచ్చే సోమవారం నాటికి ఎవరి సినిమాకి ఎక్కువ థియేటర్లు వుంటే వారిదే రాజ్యం. ‘పేట’ సినిమాకి అయితే ఈ ముప్పేట దాడిలో ఘోరంగా నలిగిపోయేలా వుంది. ఈమూవీ కేవలం పదుల సంఖ్యలోనే థియేటర్లు దొరకటం విశేషం. సినిమా ఎంత బాగున్నా కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం లేదు.

Tags:    

Similar News