'వినయ విధేయ రామ' డేట్స్ ఖరారు..!

Update: 2018-12-24 09:42 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మాస్ ఎంటర్టైనర్ ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వినయ విధేయ రామ' టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ అని రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. చరణ్ కి జోడిగా కియరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. బోయపాటి - రామ్ చరణ్ సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగిందని సమాచారం. జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. ఈ నేపథ్యంలో 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు టీం.

27న ట్రైలర్, ఆడియో...

ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుండటంతో 27న ప్రీ రిలీజ్ చేయాలని చరణ్... బోయపాటి కి చెప్పాడట. డిసెంబర్ 27న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అదే రోజు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ ఫంక్షన్ కి రాజమౌళి, ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్స్ గా వస్తారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే అదే రోజు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి ఉండడంతో రాజమౌళి వచ్చే అవకాశం లేదు. మరి ఎన్టీఆర్ వస్తాడా..? అంటే చూడాలి. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

Similar News