అయ్యో ఈ శుక్రవారం సందడేదీ..

డిసెంబర్ 21 న పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాల్తో పాటుగా రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్స్ లో సందడి చేసాయి. పడి పడి [more]

Update: 2019-01-04 03:06 GMT

డిసెంబర్ 21 న పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాల్తో పాటుగా రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్స్ లో సందడి చేసాయి. పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు యావరేజ్ తోనే ప్రేక్షకులను ఉసూరుమనిపించాయి. ఇక డబ్బింగ్ చిత్రాలైన మారి 2 అసలు ఎక్కడా కనబడలేదు వినబలేదు. ఇక కన్నడ సూపర్ హిట్ మూవీ కెజిఎఫ్ బాగానే సందడి చేసింది కానీ.. ఆ సినిమాకి పబ్లిసిటీ లేక మిన్నకుండిపోయింది. ఇక గత శుక్రవారం అయితే సుమంత్ సుబ్రమణ్యపురం తో పాటుగా… సత్య దేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమాలు విడుదలయ్యాయి. సుమంత్ సినిమా సుబ్రమణ్యపురాన్నీ ఆ సినిమా నిర్మాతలు ఎలాంటి చడీ చప్పుడు లేకుండా విడుదల చెయ్యడంతో…. ఆ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికీ తెలియదు. ఇక బ్లఫ్ మాస్టర్ టాక్ యావరేజ్ గా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులు సత్య దేవ్ ని హీరోగా యాక్సెప్ట్ చెయ్యలేక థియేటర్స్ వైపు రావడమే మానేశారు.

ఇక ఈ రోజు అంటే ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రావడానికి ఒక్క సినిమా కూడా లేదు. సంక్రాతి సినిమాలకు జడిసి ఒక్క సినిమాని విడుదల చెయ్యడానికి కూడా ఏ నిర్మాత సాహసం చెయ్యలేదు. ఎందుకంటే వచ్చే బుధవారంనుండే సంక్రాతి సినిమాల హడావిడి మొదలవుతుంది. ఇక ఇప్పుడు ఏ సినిమా విడుదలైన సంక్రాంతి సినిమాల హోరులో కొట్టుకుపోవడం ఎందుకని గమ్మునున్నారు. చిన్న సినిమాల నిర్మాతలు కూడా సాహసం చెయ్యలేదు. ఇక జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ కథానాయకుడు, పదిన తమిళ మూవీ పెటా, పదకొండున వినయ విధేయరామ, పన్నెండున ఎఫ్ టు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలు వరసగా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఫ్యామిలీ, మాస్, క్లాస్,ఆడియన్స్ అందరూ ఆత్రంగా ఈ సంక్రాతి మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా థియేటర్స్ లో సందడి చేసేది కానీ.. ఈ శుక్రవారం మాత్రం థియేటర్స్ అన్ని బోసి పోయాయి.

Tags:    

Similar News