బన్నీ 'నో'..నాని 'ఎస్'!

Update: 2018-11-02 08:30 GMT

అల్లు అర్జున్ - విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ ఓ సినిమా రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాజెక్ట్ కి ముందు విక్రమ్ కుమార్ హీరో నానితో ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈలోపు నాని తన సినిమాలతో బిజీ అయిపోవడం... విక్రమ్ బన్నీ కోసం కథను రెడీ చేయడంలో బిజీ అయిపోవడం జరిగింది. బన్నీ కు విక్రమ్ చెప్పిన కథలో సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో..దాన్ని మార్చి ఎన్నిసార్లు తీసుకొచ్చిన బన్నీకి నచ్చడం లేదు. ఈలోపు త్రివిక్రమ్ 'అరవింద సమేత' తో సూపర్ హిట్ అందుకోవడంతో.. ఆయనతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యిపోయాడు. ప్రస్తుతం కథ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి.

నానితో సినిమా ఖాయం చేసిన విక్రమ్

దీంతో విక్రమ్ పక్కకు వెళ్లి త్రివిక్రమ్ వచ్చినట్లు అయింది. అయితే ఇప్పుడు విక్రమ్ తన రూట్ మార్చి హీరో నానితో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిందని తెలుస్తుంది. అయితే నిర్మాత ఎవరు..హీరోయిన్ ఎవరు..ఇతర నటీనటులు ఎవరు అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాని చేస్తున్న 'జెర్సీ' సినిమా తరువాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం.

Similar News