బిగిల్ బడ్జెట్ ఎంత అంటే

తమిళ స్టార్ హీరో విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం ‘బిగిల్’ పై తమిళ ప్రేక్షకులు  అంచనాలు భారీగా పెట్టుకున్నారు. తెలుగులో [more]

Update: 2019-10-07 07:58 GMT

తమిళ స్టార్ హీరో విజయ్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం ‘బిగిల్’ పై తమిళ ప్రేక్షకులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. తెలుగులో ఈ మూవీ విజిల్ పేరుతో రానుంది. ఇందులో విజయ్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎంతో లావిష్ గా రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. మొదటి నుంచి ఈసినిమా యొక్క బడ్జెట్ ఎంత అయ్యి ఉంటదని చాలా లెక్కలు వేశారు కానీ తాజా తమిళ సీని వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి అక్షరాలా రూ.180 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. విజయ్ కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. అంతేకాదు శంకర్ – రజిని కాంబినేషన్ లో వచ్చిన ‘2 పాయింట్ 0’ తర్వాత రెండో అతిపెద్ద తమిళ చిత్రం కూడా ఇదే. లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ సినిమా ను ఏజిఎస్ నిర్మాణ సంస్థ భారీగా నిర్మించింది. తెలుగు లో ఈ చిత్రాన్ని నిర్మాత మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు.

 

Tags:    

Similar News