విజేత ఎంత వరకు వచ్చింది..?

Update: 2018-06-01 07:25 GMT

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి విజేత అనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై లో విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అభిమానుల అంచనాలకు తగట్లు ఈ సినిమా ఉండబోతోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 'బాహుబలి' కెమెరామెన్ కె.కె.సెంధిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు మురళి శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

నటీ నటులు

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్) ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్.

Similar News