ఫైటర్ తరవాత విజయ్ సినిమాలివే!!

విజయ్ దేవరకొండ రెండు వరస ప్లాప్స్ తో కాస్త లైన్ లోకొచ్చాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాల ప్లాప్ కి ముందు విజయ్ దేవరకొండ [more]

Update: 2020-05-04 05:03 GMT

విజయ్ దేవరకొండ రెండు వరస ప్లాప్స్ తో కాస్త లైన్ లోకొచ్చాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాల ప్లాప్ కి ముందు విజయ్ దేవరకొండ వరసగా సినిమాలు చేస్తానని అన్నాడు. కానీ రెండు ప్లాప్స్ తర్వాత సైలెంట్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఫైటర్(వర్కింగ్ టైటిల్) సినిమాని పాన్ ఇండియా ఫిలిం గా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత విజయ్ సినిమాల సంగతి ఎక్కడ కనబడలేదు వినబడలేదు. ఫైటర్ కన్నా ముందే శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా ఉంటుంది అన్న విజయ్ తర్వాత కామ్ అయ్యాడు.

అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ తో ఖాళీగా ఉనన్ విజయ్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ సినిమాల వివరాలే చెప్పాడు. అందరూ అనుకున్నట్టుగా శివ నిర్వాణతో తన సినిమా ఆగలేదు ఉంటుంది అని.. అది కూడా ఫైటర్ తర్వాత అంటున్నాడు. ఇక ఆ సినిమా దిల్ రాజు బ్యానర్ లో ఉండదని చెప్పకనే చెప్పేసాడు. దిల్ రాజు బ్యానర్ లో ఎప్పటినుండో సినిమా చేయాలనుకుంటున్నా అని.. అది శివ నిర్వాణ సినిమా తర్వాత ఉంటుంది అని.. దాని కోసం ఇప్పటికే కథ, దర్శకడు ఫైనల్ అయ్యాయని చెప్పిన విజయ్ దేవరకొండ ఆ సినిమాకి దర్శకుడెవరనేది రివీల్ చెయ్యలేదు. అది అప్పుడే చెబితే థ్రిల్ ఏముంటుంది అని సస్పెన్స్ లో పెట్టేసాడు. సో ఫైటర్ తర్వాత విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అవన్నమాట.

Tags:    

Similar News