విజయశాంతి కన్నా రష్మిక కు తక్కువా?

సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ హీరో అంటేనే మాములుగా క్రేజ్ లేదు.. ఇక అలనాటి మేటి హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ అంటే.. ఇంకా పిచ్చ క్రేజ్. [more]

Update: 2020-01-08 06:06 GMT

సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ హీరో అంటేనే మాములుగా క్రేజ్ లేదు.. ఇక అలనాటి మేటి హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ అంటే.. ఇంకా పిచ్చ క్రేజ్. అంతేకాకుండా లక్కీ హీరోయిన్ రష్మిక హీరోయిన్. మరి ఇవన్నీ సరిలేరు కి స్పెషల్స్ కావడం…ఆలా ఉంచితే ఈ సినిమాలో మహేష్ సరసన నటించినందుకు రష్మిక ఇంకా ఎగ్జైట్ అవుతూనే ఉంది. సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ లో ఇంత పెద్ద ఫంక్షన్ లో స్టేజ్ మీదుండడం ఇదే మొదటిసారి అంటూ తెగ సంబరపడిపోయింది. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్ర కన్నా విజయశాంతి పాత్రే హైలెట్ అవుతుంది అని… కేవలం సినిమాలోనే కాదు… రెమ్యునరేషన్ పరంగాను రష్మిక కన్నా విజయశాంతి ఎక్కువ తీసుకుందని టాక్ నడుస్తుంది.

సరిలేరు నీకెవ్వరూ సినిమాలో పాత్ర ప్రాధాన్యత ఎంత ఉన్నప్పటికీ…విజయశాంతి ఈ సినిమాకోసం ఏకంగా 2.5 కోట్లు పారితోషకం అడిగిందని.. కానీ ఆమెని ఒప్పించి చివరికి కోటిన్నరకు సరిలేరు టీం సెటిల్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి పాత్ర ప్రాధాన్యతో పాటుగా భారీగా అరితోషకం.. ఇక రాములమ్మ సినిమాల మీద సినిమాలు చేస్తుంది అందుకే ఇలా డిమాండ్ చేస్తుంది అంటున్నారు. మరోపక్క హీరోయిన్ రష్మిక కి విజయశాంతి కన్నా తక్కువ రెమ్యునరేషన్ అంటే.. కోటి రూపాయలు ఆమెకి పారితోషకంగా ఇచ్చినట్టుగా టాక్. మరి విజయశాంతి అంటే పవర్ ఫుల్ రీ ఎంట్రీ.. కానీ రష్మిక కి ఫస్ట్ టైం స్టార్ హీరో దొరకడంతో.. కోటితో సరిపెట్టుకుంది.

Tags:    

Similar News