రాములమ్మ ఈ అవకాశాన్ని బాగా వాడుకుంటుందా?

విజయశాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో.. గ్రాండ్ గా రీ ఎంట్రీ అవుతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా మరో పది రోజుల్లోనే విడుదలకాబోతుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో [more]

Update: 2020-01-02 12:59 GMT

విజయశాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో.. గ్రాండ్ గా రీ ఎంట్రీ అవుతుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా మరో పది రోజుల్లోనే విడుదలకాబోతుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటుంది మూవీ టీం. దానిలో భాగంగా విజయశాంతి ప్రస్తుతం ఇంటర్వూస్ స్టార్ట్ చేసింది. మహేష్ చిన్నప్పటి సంగతులు మొదలు పెట్టి. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ లో మహేష్ ముచ్చట్లు కథలు కథలుగా చెబుతూ బాగా హైలెట్ అవుతుంది. ఈ సినిమా తో తానున్న ఒత్తిడినుండి బయటికొచ్చా అని.. గత కొన్నాళ్లుగా తీవ్ర వత్తిడిలో ఉన్న తాను సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా ఆ ఒత్తిడి నుండి బయటికొచ్చా అని చెబుతుంది. సినిమాలో మహేష్ కామెడీ సూపర్ అని, మహేష్ కామెడీ టైమింగ్ చాలా బావుంది అని.. మహేష్ పాత్ర ద్వారా సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాదాని మహేష్ ని ఆకాశానికెత్తేస్తుంది.

ఇక కొడుకుదిద్దిన కాపురం సినిమా టైం లో మహేష్ చిన్నపిల్లాడు అప్పట్లో.. మహేష్ ని నేను జాగ్రత్తగా చూసుకుంటే… ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమా టైములో తనని మహేష్ గౌరవంగా చూసుకున్నాడని చెబుతుంది. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నాకు మహేష్ కాంబో సీన్స్ లో యాక్షన్, ఎమోషన్ సీన్లు హైలెట్ అని.. ఇంకా సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్ కామెడీ ఉంటుందని… సినిమాపై క్రేజ్ పెంచడమే కాదు.. ఈ సినిమా ద్వారా విజయశాంతి తనకి తానూ బాగా పబ్లిసిటీ చేసుకుంటుందని. ఎందుకంటే సరిలేరు నీకెవ్వఁరు సినిమా తనకి సరైన రీ ఎంట్రీ సినిమా అంటూ చెబుతుంది. మరి ఈ సినిమా తర్వాత విజయశాంతి కి వరసబెట్టి సినిమాలొస్తాయేమో చూడాలి.

Tags:    

Similar News