విజయశాంతి కండిషన్స్ అన్నారు.. కానీ..?

లేడి సూపర్ స్టార్ విజయశాంతి మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాలతో సినిమాలు పక్కనబెట్టిన విజయశాంతి మళ్ళీ సినిమాల్లోకి రావడం.. [more]

Update: 2020-02-03 05:49 GMT

లేడి సూపర్ స్టార్ విజయశాంతి మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రాజకీయాలతో సినిమాలు పక్కనబెట్టిన విజయశాంతి మళ్ళీ సినిమాల్లోకి రావడం.. ఇక సినిమాలు చేసుకుంటుంది అనే టాక్ కూడా బాగా వినబడింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో పవర్ ఫుల్ భారతి పాత్రకి తగిన న్యాయం చేసిన విజయశాంతి.. ఇక సినిమాల్లో కొనసాగుతుంది అని ఆమెని అనేకమంది దర్శకనిర్మాతలు కలవడం.. దానికి విజయశాంతి కండిషన్స్ అప్లై అంటూ.. సినిమాలో హీరోతో సమానమైన పాత్ర ఇవ్వడం దగ్గరనుండి.. ప్రమోషన్స్ లో పోస్టర్స్ మీద కూడా తనకి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే అడిగినంత పారితోషకం ఇవ్వాలని కండిషన్స్ పెడుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

కానీ తాజాగా విజయశాంతి ఆమె అభిమానులకు పెద్ద షాకిచ్చింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తన పాత్రని ఇష్టపడిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడమే కాదు.. మళ్ళీ తాను సినిమాల్లో నటిస్తానో లేదో అంటూ కామెంట్ చేసి షాకిచ్చింది. రాజకీయాలతో, ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో.. లేదో.. కూడా నాకు తెలియదు.. ప్రస్తుతానికైతే సెలవు. నన్ను అభిమానంతో ఆదరించిన మీకు, ,నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు మీ విజయశాంతి…అంటూ ట్వీట్ చెయ్యడం ఇప్పుడు ఆమె అభిమానులకే కాదు.. మిగతా ప్రేక్షకులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఎవరైన పవర్ ఫుల్ పాత్రతో ఆమె దగ్గరకి వెళితే మల్లి విజయశాంతి ఏమన్నా పురాలోచిస్తుందేమో అనే ఆశతో ఉన్నారు ఆమె అభిమానులు.

Tags:    

Similar News