విజయ్ సినిమాపై వచ్చిన వన్నీ రూమర్సే

ప్రస్తుతం టాలీవుడ్ లో యమా ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ హీరో అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని ఆనంద్ అన్నామలై అనే డైరెక్టర్ తెలుగు, తమిళంలలో [more]

Update: 2019-10-21 08:19 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో యమా ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ హీరో అనే సినిమా చేస్తున్నాడు. దీన్ని ఆనంద్ అన్నామలై అనే డైరెక్టర్ తెలుగు, తమిళంలలో రూపొందించనున్నారు. ఇది బైక్ రేసింగ్ కి సంబంధించి సినిమా అని తెలిసిన విషయమే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా కోసం 50 కోట్లు ఖర్చు చేస్తునట్టు తెలుస్తుంది.

పుకార్లు….షికార్లు

ఈ సినిమా షూటింగ్ సగంలో ఆగిపోయిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కారణాలు ఏవో కానీ మూవీ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్రం యూనిట్ కూడా ఎక్కడ స్పందించలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజా సమాచారం ప్రకారం ఇవ్వన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలుస్తోంది. సినిమా ఆగిపోలేదని తెలుస్తుంది. నవంబర్ లో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ కోసం విజయ్ అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నాడు. ఇందులో హీరోయిన్ గా తమిళ నటి మాళవిక మోహనన్ నటిస్తుంది. ప్రస్తుతం విజయ్ ఈ మూవీ తో పాటు వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నాడు.

 

 

Tags:    

Similar News