విజయ్ దేవరకొండని పరేషాన్ చేస్తున్న పాట..!

Update: 2018-08-02 10:11 GMT

అర్జున్ రెడ్డి హిట్ తో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ను సాధించిన విజయ్ దేవరకొండకు ఓ పాట ఇబ్బందిగా మారింది. ఆయన తాజాగా నటించిన గీత గోవిందం సీనిమా ఆగస్టు 15 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. అయితే, ఇందులో విజయ్ దేవరకొండ ‘వాట్ ది ఎఫ్’ అంటూ ఓ పాట పాడాడు. ఈ పాటను ముందే యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇందులో అభ్యంతరకర పదాలు ఉన్నాయని కొందరు ఫిర్యాదు చేయడంతో పాట లిరిక్స్ ను మార్చారు. ‘వాట్ ది లైఫ్’ అంటూ కొన్ని పదాలను మార్చారు. అయితే, ఈ పాటను మార్చి పడటానికి మళ్లీ ఓ గాయకుడిని వెతుకుతుందంట చిత్ర బృందం. విజయ్ ముందుగా పాడిన పాట అంతగా ఆకట్టుకోలేదని బాగా ట్రోల్ అయ్యాడు. దీంతో విజయ్ స్థానంలో మరో సింగర్ కోసం వెతుకుతున్నారు. ఈ కొత్త పాట సినిమాలో చూడాల్సిందేనట. విజయ్ హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

Similar News