నాకు ఏడుపొస్తోంది : విజయ్

Update: 2018-08-13 06:16 GMT

'గీత గోవిందం' సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న విడుదల అవుతున్న ఈ సినిమాకు లీక్స్ తో పెద్ద షాకే తగిలింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ సీన్స్ ఓ వ్యక్తి వల్ల బయటికి వెళ్లాయి. అంతే కాకుండా విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాలో కొన్ని సీన్స్ లీక్ అయ్యాయట. లీక్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

ఆవేదనతో ట్వీట్

అయితే లీక్స్ పై నిన్న విజయ్ దేవరకొండ స్పందించారు. సినిమా లీక్స్ అయిన విషయాన్ని ప్రస్తావించకుండా ‘నేను నిరాశకు గురయ్యాను, బాధపడుతున్నాను. ఒకసారి కొపమొస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తోంది’ అంటూ ఒకింత ఆవేదనతో స్పందించారు. లీక్ అయిన సీన్స్ ను ఉద్దేశించుకునే విజయ్ ఇలా ట్వీట్ చేసాడని తన ఫ్యాన్స్ బావిస్తున్నారు.

పోలీసుల అదుపులో లీకేజ్ బాబులు...

ఒకేసారి రిలీజ్ అవ్వాల్సిన రెండు సినిమాలు ఇలా లీక్ అయ్యితే ఎవరికైనా బాధే కదా. లీకేజ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి పోలీస్ లు విచారిస్తున్నారు. వీరు గుంటూరుకి చెందిన రెండు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులాగా గుర్తించారు పోలీసులు. ఆ లీక్ అయ్యిన సీన్స్ ను సోషల్ మీడియా నుండి తొలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు మేకర్స్.

Similar News