విజయ్... మాటే వినదుగా పాట హంగామా

Update: 2018-10-31 06:24 GMT

గీత గోవిందం చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడిదే ఊపును ప్రదర్శిస్తోంది మరో పాట. "మాటే వినదుగా" అంటూ సాగే ఈ పాట టాక్సీవాలా చిత్రం లోనిది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న టాక్సీవాలా చిత్రంలోని మాటే వినదుగా పాట 2 మిలియన్ వ్యూస్ సంపాదించేందుకు ఏంతో టైం పట్టలేదు. ముఖ్యంగా ఈ పాటలోని మెలోడీ టచ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సిడ్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. జేక్స్ అద్భుతమైన రొమాంటిక్ మెలోసాంగ్ అందించాడు. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ పాట సినిమాలో కీలకమైంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా...

మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ వర్క్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. నవంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Similar News