అమ్మాయి గెటప్ లో అదరగొడుతున్న విజయ్..!

Update: 2018-10-10 10:45 GMT

కోలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ సేతుపతి క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పటికే త్రిషతో కలిసి 96 సినిమాతో హిట్ అందుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. విజయ్ సేతుపతి - త్రిష కలయికలో తెరకెక్కిన 96 గత శుక్రవారమే విడుదలయింది. 96 సినిమా తమిళ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేయ్యడమే కాదు... తెలుగులో టాప్ నిర్మాత అయిన దిల్ రాజు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనెయ్యడంతో విజయ్ సేతుపతి నటించిన 96 పై తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

హిజ్రా పాత్రలో కనిపిస్తాడా..?

ఇక 96 తర్వాత విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సూపర్‌ డీలక్స్‌ ఫస్ట్‌ లుక్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాడు. ఆ ఫస్ట్‌ లుక్‌లో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ అదిరిపోయింది. అరణ్యకాండ ఫేమ్‌ త్యాగరాజన్‌ కామరాజర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సేతుపతి హిజ్రా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో సమంత నటిస్తుంది. ప్రస్తుతం విజయ్ వేసిన లేడి గెటప్ మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపోతే విజయ్ సేతుపతి తెలుగులో భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో తెరకెక్కుతున్న చిరు సైరా లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Similar News