సలార్ కి విజయ్ అవసరముందట!

ప్రభాస్ – కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సలార్ సినిమాలో విజయ్ సేతుపతిని ప్రభాస్ తో ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ పాత్ర [more]

Update: 2021-01-23 06:47 GMT

ప్రభాస్ – కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే సలార్ సినిమాలో విజయ్ సేతుపతిని ప్రభాస్ తో ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ సంప్రదిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సలార్ సినిమా ఈ మధ్యనే మొదలయ్యింది. రెగ్యులర్ షూట్ కి వెళ్ళేలోపు ప్రభాస్ ని ఢీ కొట్టబోయే విలన్ ఎంపిక అత్యవసరమట. 

అందుకే ఆ పాత్రకి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి అయితే బావుంటుంది అని.. ఈ మధ్యన మాస్టర్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటన చూసిన ప్రశాంత్ ఎలాగైనా సలార్ కి విలన్ గా విజయ్ సేతుపతినే సెట్ చెయ్యాలని ఆలోచిస్తున్నాడట. అందుకే విజయ్ సేతుపతిని సలార్ టీం సంప్రదించడానికి రెడీ అవుతుందట. మరి ప్రభాస్ సలార్ కి విజయ్ సేతుపతి జై కొడతాడా అనేది ఇప్పుడు అందరిలో ఆశక్తిగా మారింది.

Tags:    

Similar News