విజయ్ మాస్ అంటే ఇదేనేమో!!

Update: 2018-10-20 05:48 GMT

కోలీవుడ్ లో రజిని అంతటి స్థాయిలో ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ అండ్ అజిత్ లు. వీరికి అక్కడ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రజిని తర్వాత అక్కడ అంతగా క్రేజ్ ఉన్న హీరోల్లో వీరిద్దరూ ఉన్నారు. ఎక్కువ శాతం వీరి ఇద్దరి మధ్యలోనే బాక్సాఫీస్ యుద్ధం కూడా నడుస్తుంది. అలానే యూట్యూబ్ రికార్డ్స్ లో కూడా వీరిద్దరి మధ్యే జరుగుతుంది.

అజిత్ టీజర్ కు......

అజిత్ “వివేగం” టీజర్ కు యూట్యూబ్ లో 24 గంటల్లో ఐదు లక్షల డబ్భై ఐదు వేల లైక్స్ తో రికార్డు సృష్టిస్తే దాన్ని విజయ్ 'మెర్సల్' చిత్రం టీజర్ తో కొన్ని గంటల్లోనే బద్దలుగొట్టేసారు. అంతేకాదు మిలియన్ లైక్స్ సాధించి ప్రపంచ రికార్డే సృష్టించారు. అదే పెద్ద రికార్డు అనుకుంటే మారోసారి విజయ్ ఫ్యాన్స్ తన హీరో స్టామినాను చాటుకున్నారు.

సర్కార్ టీజర్ కు......

మురగదాస్..డైరెక్షన్ విజయ్ “సర్కార్” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుంది. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం యొక్క టీజర్ నిన్న సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినా ఒక్క గంటలోనే 575K(ఐదు లక్షల డబ్భై ఐదు వేలు) లైక్స్ సాధించి అస్సలు ఎవ్వరికి అందని రికార్డును సృష్టించింది. సాధారణంగా టీజర్ కు వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి లైక్స్ కన్నా. కానీ ఈచిత్రం అనూహ్యంగా లైక్స్ ని సాధించింది. చూడాలి ఈ టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని..

Similar News