‘సర్కార్’ అప్పుడే ఒక రికార్డు క్రియేట్ చేసింది..!

Update: 2018-11-05 08:18 GMT

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన 'సర్కార్' చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కి ముందే కేరళలో రికార్డుని క్రియేట్ చేసింది. అక్కడ ఈ సినిమా ఏకంగా 402 స్క్రీన్లలో విడుదల కానుంది. ప్రీ బుకింగ్స్ రూపంలో అప్పుడే 3 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడాయి.

200 కోట్ల క్లబ్ లోకి..?

సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే ఈజీగా 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా రిజల్ట్ ఏంటో తేలిపోనుంది. మరోపక్క తమిళనాట విజయ్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసారు.

Similar News