సై రా విజయ్ రోల్ ఇదే...!

Update: 2018-07-31 06:03 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సై రా సినిమా షూటింగ్ ఒక రేంజ్ లో పరిగెడుతుంది. మొన్నటివరకు నత్తనడక నడిచిన సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ హైదరాబద్ లో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఆంగ్లేయులతో సై రా నరసింహారెడ్డికి మధ్య జరిగే భారీ పోరాట సన్నివేశాలను కంప్లీట్ చేసుకున్న సై రా యూనిట్ ఇప్పుడు మరో భారీ షెడ్యూల్ కోసం విదేశాలకు పయనమవుతుంది. ఇక సై రా తర్వాతి షెడ్యూల్ ను అబ్రాడ్ లో చెయ్యడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సై రా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు సురేందర్ రెడ్డి లు కలిసి లొకేషన్స్ కోసం ఈ వారం యూరోప్ కు బయలు దేరనున్నారని చెబుతున్నారు.

పాత్రలేంటో చెప్పేస్తున్న నటులు

ఇక ఆ షెడ్యూల్ లో తాను కూడా జాయిన్ అవబోతున్నట్లుగా తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి స్వయంగా తానే చెబుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమితాబ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు తాజాగా కన్నడ సుదీప్ సన్నివేశాలను చిత్రీకరించాడు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి సై రా కోసం దిగబోతున్నాడు. ఇక ఈ సినిమా లో ఎవరి పాత్రలేమిటో ఆయా నటులు కొద్దీకొద్దిగా రివీల్ చేసేసారు. అమితాబ్ సై రా గురువుగా... సుదీప్ ఆంగ్లేయుడిగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా సై రా సినిమా లో తన రోల్ ఏమిటో... రివీల్ చేసేసాడు.

ద్రవిడ రాజుగా విజయ్...

ఇక ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో విజయ్ సేతుపతి తమిళ్ యాసతో కూడిన పాత్ర చేస్తున్నాడట. అలాగే తమిళ యాసతో కూడిన పాత్ర అయినా... అక్కడక్కడా తెలుగు మాటలు కూడా పడతాయని చెప్పుకొచ్చాడు. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి తమిళంకి ఉన్న సంబంధం ఏమిటో క్లారిటీ లేదుగాని.. విజయ్ సేతుపతి మాత్రం సై రా సినిమా లో తమిళ్ తో కూడిన తెలుగు భాష మాట్లాడే ఒక ద్రవిడ రాజు పాత్రలో కనిపిస్తాడనేది స్పష్టమైంది. ఇక అబ్రాడ్ లో చెయ్యబోయే షెడ్యూల్ కూడా దాదపుగా 30 రోజుల పాటు సుదీర్ఘంగా ఉంటుందని.. అయితే ఈ షెడ్యూల్ లో కూడా హెవీ డ్యూటీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చెయ్యడమే కాదు.. దాని కోసం భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొనబోతున్నారట.

Similar News