అంత టాలెంట్ నటుడిని భయపెట్టేసారుగా?

తెలుగు, తమిళ హిందీ భాషల్లో నచ్చిన కేరెక్టర్స్ చేస్తూ.. మూడు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఓ సినిమా విషయంలో బాగా నలిగిపోయాడు. హీరోగా [more]

Update: 2020-10-21 05:26 GMT

తెలుగు, తమిళ హిందీ భాషల్లో నచ్చిన కేరెక్టర్స్ చేస్తూ.. మూడు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఓ సినిమా విషయంలో బాగా నలిగిపోయాడు. హీరోగా అదరగొడుతూనే విలన్ పాత్రలను, కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను విజయ్ సేతుపతి దున్నేస్తున్నాడు. అలాంటి విలక్షణ నటుడు ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు భయపడిపోయాడు. అది కూడా ఓ సినిమా విషయంలో. ప్రేక్షకులు అభిమానులు ఆగ్రహిస్తే ఎంతటి నటుడైన తగ్గాల్సిందే అని విజయ్ సేతుపతి ని చూస్తే అర్ధమవుతుంది. శ్రీలంక క్రికెటర్ ముయ్యత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 లో ముత్తయ్య రోల్ లో నటించడానికి రెడీ అయ్యి ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యాక అసలు కథ మొదలైంది.

తమిళులని ఊచ కోత కోసిన శ్రీలంక కి ఆడే క్రికెటర్ ముత్తయ్య బయోపిక్ లో ఎలా నటిస్తావ్, ముత్తయ్య దేశ ద్రోహి లాంటి పాత్ర నువ్వెందుకు చేస్తున్నావ్ అంటూ విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడమే కాదు బండ బూతులు కూడా తిడుతున్నారు. దానితో ముత్తయ్య మురళీధరన్ కూడా విజయ్ సేతుపతి తన పాత్రలో నటించొద్దంటూ విన్నపం చేసుకున్నాడు. తన బయోపిక్ లో నటించడం వలన ఓ నటుడు ఇబ్బంది పాడడం తాను చూడలేనని అన్నాడు.. ఇక విజయ్ సేతుపతి కూడా తమిళ అభిమాన ప్రేక్షకుల ఒత్తిళ్లకు తలొగ్గి ముత్తయ్య బయోపిక్ 800 నుండి తప్పుకున్నాడు. మరి కేవలం వినోదం కోసం చేసే సినిమా విషయంలో ప్రేక్షకులు ఇంత నిక్కచ్చిగా ఉండి ఓ విలక్షణ నటుడిని బాధపడేలా చేసారు. మరి నిజంగా బోలెడంత టాలెంట్ ఉన్న నటుడు విజయ్ ని తమిళులు నిజంగా భయపెట్టేసారు.

Tags:    

Similar News