నోటా విడుదల అప్పుడేనా..?

Update: 2018-09-12 10:29 GMT

విజయ్ దేవరకొండకి గీత గోవిందం సినిమాతో బోలెడంత ఫేమ్ వచ్చేసింది. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అవతారమెత్తిన విజయ్ కి గీత గోవిందం స్టార్ హీరో హోదా తెచ్చిపెట్టింది. ఇక విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాల మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో బోలెడంత ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. ఇక విజయ్ తర్వాతి సినిమాల నిర్మాతలకు కూడా విజయ్ క్రేజ్ క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలు పుడుతున్నాయి. తాజాగా విజయ్ నటిస్తున్న టాక్సీవాలా విడుదల విషయం క్లారిటీ లేదుగాని.. తమిళం, తెలుగులో చేస్తున్న నోటా సినిమా విడుదల మాత్రం అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటున్నారు. కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ వెళ్లగానే అక్టోబర్ సెకండ్ వీక్ లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అరవింద సమేతతో రావడం.. నోటా థియేటర్స్ మొత్తం అరవింద సమేత కోసం కేటాయే అవకాశం ఉంది. దీంతో నోటా గనక హిట్ అయినా ఫట్టయినా.. నిర్మాతలకు లాస్ తప్పదు. అందుకే అక్టోబర్ థర్డ్ వీక్ లో విడుదల చేద్దామనుకుంటే.. ఈసారి కోలీవుడ్ నుండి గట్టి పోటీ ఉంది.

అక్టోబర్ మొదటి వారంలోనే...

విశాల్ పందెం కోడి, ధనుష్ చిత్రాలు అక్టోబర్ 18 కే రాబోతున్నాయి. దీంతో నోటా నిర్మాత జ్ఞానవేల్ తీసుకునే నిర్ణయంతో.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోని విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది. అమర్ అక్బర్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ అనుకుంటే.. నోటాతో విజయ్ దిగడంతో... అమర్ నిర్మాతలకు దడపుట్టి విడుదల తేదీని మర్చే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు నోటా విడుదలకు ఆ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజాకి బోలెడంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. నోటాని అక్టోబర్ థర్డ్ వీక్ లో ధనుష్, విశాల్ తో పోటీపడే కన్నా ఫస్ట్ వీక్ లోనే చుట్టెయ్యడం బెటర్ అనుకుంటున్నట్టుగా సమాచారం. మరి విజయ్ క్రేజ్ ముందు ఏ డేట్ అయినా ఓకె. కానీ నిర్మతలకు ఉండే భయం నిర్మాతలకుంటుంది. అది సహజమే కదా..!

Similar News