రజిని అయ్యాడు.. విజయ్ మిగిలాడు!!

తమిళనాట రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఇదిగో అదిగో అంటూ ఇప్పటికే ఏళ్ళకి ఏళ్ళు గడుస్తున్నాయి కానీ… రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చింది లేదు.. ఆయన రాజకీయం చేసింది లేదు. [more]

Update: 2020-08-17 05:28 GMT

తమిళనాట రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఇదిగో అదిగో అంటూ ఇప్పటికే ఏళ్ళకి ఏళ్ళు గడుస్తున్నాయి కానీ… రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చింది లేదు.. ఆయన రాజకీయం చేసింది లేదు. కానీ సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే రాజకీయాల్లోకి రజినీకాంత్ రాకపోవచ్చేమో అనే ఊహాగానాలు ఉన్నాయి. కారణం ఆయన ఆరోగ్యమే. అయితే ఇప్పుడు రజిని టైప్ లోనే మరో హీరో రాజకీయ అరంగేట్రంపై ఓ న్యూస్ కోలీవుడ్ నుండి టాలీవుడ్ మీడియా సర్కిల్స్ వరకు స్ప్రెడ్ అయ్యింది. తమిళనాట రజినీకాంత్ తరవాత ప్లేస్ లో ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాడని న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అజిత్ ఫాన్స్ – విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎంతగా చెలరేగిపోయి.. గొడవ చేసిన విజయ్ ఎప్పుడు స్పందించింది లేదు. ఎప్పుడూ గుంభనంగా ఉండే విజయ్ తాజాగా తన క్రేజ్ తో రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాడని న్యూస్ కోలీవుడ్ ని షేక్ చేస్తుంది. అయితే విజయ్ ఏ రాజకీయ పార్టీ ద్వారానో రాజకీయాల్లోకి రాకుండా.. సొంతంగా పార్టీ పెట్టి మరీ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాని ముంచేసింది. దానిలో భగంగా విజయ్ తండ్రి ఇప్పటికే రంగంలోకి దిగారని.. ఆయన విజయ్ పార్టీ గురించి గ్రౌండ్ వర్క్ చెయ్యడము..కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి కూడా రేడి అవుతున్నారనే న్యూస్ వినిపిస్తుంది. అయితే కొంతమంది ఇప్పటిదాకా రజిని ఊగాడు.. కానీ రాజకీయాల్లోకి రావడానికి ధైర్యం చాలడం లేదు.. ఇక ఇప్పుడు విజయ్ వంతు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News