వామ్మో నెగటివ్ టాక్ తోనే కోట్లు కొల్లగెట్టేసాడు

Update: 2018-11-22 05:08 GMT

మరి ఆ కాంబో మీదున్న క్రేజో, స్టార్ హీరో విజయ్ కున్న క్రేజో, మురుగదాస్ అంటే పిచ్చో తెలియదు కానీ... సినిమాకి డివైడ్ టాకొచ్చినా ఆ సినిమా కి కోట్లు వర్షంకురుస్తుంది అంటే... మాత్రం నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. విజయ్ - మురుగదాస్ కాంబో క్రేజీ కాంబో. ఇప్పటివరకు వారి కాంబోలో వచ్చిన కత్తి కానివ్వండి, తుపాకీ కానివ్వండి సూపర్ డూపర్ హిట్ మాత్రమే కాదు.. కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలే. అందుకే ఇప్పుడు వారి కాంబోలో వచ్చిన సర్కార్ సినిమాకి ఫుల్ గా నెగెటివ్ టాకొచ్చినా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయిన్నాయి. ఫస్ట్ వీకెండ్ కె 100 కోట్ల క్లబ్బులో కాలుపెట్టిన విజయ్ సర్కార్ కలెక్షన్స్ మాములుగా లేవు.

వివాదాల విషయం పక్కనబెట్టి మరీ కెలెక్షన్స్ పరంగా వారానికో క్లబ్బులోకి అడుగుపెడుతూ సర్కార్ సినిమా అదరగొట్టేస్తుంది. ఫస్ట్ వీకెండ్ కి 100 కోట్ల క్లబ్బులో అడుగెట్టిన సర్కార్ రెండోవారంలో 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. అంతేనా.... ఈ సినిమా ఇప్పుడు 250 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేందుకు ఉవ్విళూరుతుంది. ఈ సినిమా 247 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. మరి 250 కోట్ల క్లబ్బులో విజయ్ వెళ్లడం పెద్ద విషయంగా కనబడడం లేదు. వివాదాలతోనే, నెగెటివ్ టాక్ తోనే విజయ్ సర్కార్ ఇలా వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీసుని చెడుగుడు ఆడుతుంది అంటే మాత్రం నిజంగా మిరాకిల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు.

Similar News