విజయ్ అయినా బ్లాక్ బస్టర్ ఇస్తాడా..!!

Update: 2018-10-20 04:47 GMT

కీర్తి సురేష్.. రామ్ సరసన నేను శైలజ, నాని సరసన నేను లోకల్ అంటూ డీసెంట్ హిట్స్ కొట్టింది. తర్వాత స్టార్ హీరో పవన్ సరసన వచ్చిన ఛాన్స్ ని ఎగిరిగంతేసి ఒప్పుకుంది. పవన్ అజ్ఞాతవాసి తో భారీ డిజాస్టర్ అందుతుంది. తర్వాత మళ్ళీ సావిత్రి మహానటి మూవీ తో అందనంత ఎత్తుకు ఎదిగింది. ఆ సినిమాలో విమర్శకుల నుండి మెప్పుపొందింది. ఇక కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకుంది.. రాజమౌళి మల్టీస్టారర్ దగ్గరనుండి అనేకమంది స్టార్ హీరోల సినిమాల్లో టాలీవుడ్ లో కీర్తి సురేష్ నటిస్తుంది... దానితో పెద్ద స్టార్ హీరోయిన్ గా మారుతుంది అని అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం తెలుగులో ఒక్క సినిమాకి సైన్ చెయ్యలేదు.

టాలీవుడ్ కు దూరమయిందా?

కానీ మహానటి సినిమా టైం లో ఒప్పుకున్న పందెం కోడి 2, సామి స్క్వేర్, సర్కార్ సినిమాల్తో తమిళనాట బిజీ అయ్యింది. అయితే తెలుగులో కీర్తి కి వచ్చినా అవకాశాలు వదిలేసిందో.. అసలు రాలేదో కానీ. టాలీవుడ్ కు మాత్రం కీర్తి సురేష్ దూరమైందని చెప్పాలి. ఇక కోలీవుడ్ మూవీస్ మీద ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్ కి విక్రమ్ తో నటించిన సామి స్క్వేర్ తో అద్భుతమైన డిజాస్టర్ ఇవ్వగా.. ఆ సినిమాతో కీర్తి బరువు మీద కామెంట్స్ పడ్డాయి. ఇక తాజగా విశాల్ తో కలిసి పందెం కోడి 2 తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఆమెకి ఆ సినిమాకూడా యావరేజే ఇచ్చింది.

దీపావళి కానుకగా.....

ఈ సినిమాలో కీర్తి నటన బావున్నప్పటికీ... చాలా చోట్ల తేలిపోయినదన్నారు. పాపం కీర్తి అని అందరూ అనుకునేలోపు.. విజయ్ - మురుగదాస్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న సర్కార్ సినిమా టీజర్ తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం ఈ టీజర్ లో మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటు ను వినియోగించుకోవడానికి ఇండియా కి వస్తాడు.... ఆ తరువాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ విజయ్ వెన్నంటే ఉండే పాత్ర అంటే పీఏ పాత్రలో కనిపిస్తుందనిపిస్తుంది. ఇక లుక్స్ లోను కీర్తి కాస్త సన్నగా అందంగానే ట్రెడిషనల్ గా కనబడుతుంది. మరి విజయ్ అయినా కీర్తిబ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి.

Similar News