విజయ్ డల్ గా ఉండటానికి కారణం ఏంటి..?

Update: 2018-10-25 11:56 GMT

విజయ్ దేవేరుకోండ తన సినిమాల ప్రమోషన్స్, రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా చేస్తుంటారు. ప్రమోషన్స్ లో చాలా యాక్టీవ్ గా ఉండే విజయ్ తన కొత్త సినిమా 'టాక్సీవాలా' విషయంలో చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాలు వల్ల రిలీజ్ కాలేదు. 'నోటా' సినిమాకి ముందు 'టాక్సీవాలా' రిలీజ్ కావాలి కానీ విజయ్ దీన్ని హోల్డ్ లో పెట్టి 'నోటా' ని రిలీజ్ చేశాడు. 'గీత గోవిందం' టైంలో 'టాక్సీవ్వాలా' సినిమా మొత్తం బయటికి రావడంతో విజయ్ చాలా డల్ అయ్యిపోయాడు. అందుకే 'గీత గోవిందం' తరువాత 'నోటా' ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు మల్లి తెరపైకి ఈ చిత్రం రిలీజ్ ను తీసుకొచ్చాడు. నవంబర్‌ 16న ఈ సినిమా విడుదల అవుతుంది.

సినిమా బయటకు వచ్చేసిందనా..?

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో విజయ్ చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. మరి కారణం ఏంటో తెలియలేదు. బహుశా ఈ సినిమా బయటికి వచ్చేసింది కాదా అందుకే ప్రమోషన్స్ చేసినా వేస్ట్ అని భవిస్తున్నాడేమో..'నోటా' రిలీజ్ తరువాత విజయ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో 'నోటా' ఫ్లాప్‌ అయిందని ఇండస్ట్రీలో కొందరు పండగ చేసుకున్నారని విజయ్‌ ఆరోపించాడు. అటువంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసుకోండి.. తరువాత మళ్లీ అవకాశం ఇవ్వనని కూడా అన్నాడు. విజయ్ మీద పడి ఏడుస్తుంది ఎవరు.? అసలు విజయ్ ఎందుకు ప్రమోషన్స్ విషయంలో డల్ అయ్యాడు అనేది తెలియాల్సి ఉంది.

Similar News