హిందీ హిట్ చిత్రం రీమేక్ చేయనున్న విజయ్..!

బాలీవుడ్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైన ‘గల్లీ బాయ్‌’ ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా ఆలియా భట్‌ [more]

Update: 2019-04-17 10:06 GMT

బాలీవుడ్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైన ‘గల్లీ బాయ్‌’ ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా ఆలియా భట్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు మన మేకర్స్. ఇందులో సాయిధరమ్ తేజ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఓకే అనేసిన విజయ్

అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ అంటున్నారు. ఇప్పటికే నిర్మాతలు విజయ్ ను సంప్రదించగా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. విజయ్ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు విజయ్.. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అలానే నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణతోనూ ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News