విజయ్ దేవరకొండ ఆ బాలీవుడ్ మూవీ చేస్తాడా?

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ ఫైటర్ స్క్రిప్ట్ తోనే పాన్ ఇండియా లెవెల్ కి మూవీ ప్లాన్ చేసాడు. పూరి ముందు పాన్ ఇండియా మూవీ గా [more]

Update: 2020-09-25 07:00 GMT

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ ఫైటర్ స్క్రిప్ట్ తోనే పాన్ ఇండియా లెవెల్ కి మూవీ ప్లాన్ చేసాడు. పూరి ముందు పాన్ ఇండియా మూవీ గా అనుకోలేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆ కథని పాన్ ఇండియా కి మార్చేశాడు. ఇక ఫైటర్ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఓ బాలీవుడ్ మూవీ చెయ్యాలని అనుకున్నా.. పక్కా ప్లాట్ ఫామ్ దొరక్క ఆగాడు. కరణ్ జోహార్ కి డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ తో సినిమా చెయ్యాలని ఉన్నా.. డియర్ కామ్రేడ్ కాస్త తారుమారయ్యేసరికి.. పూరి తో కలిసి విజయ్ ఫైటర్ మూవీ భాగస్వామిగా మారాడు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ ఒప్పుకోబోతున్నాడనే టాక్ నడుస్తుంది. అది కూడా ఓ దేశభక్తుడు కథతో. గత ఏడాది పుల్వామా దాడులలో పాక్ సైన్యానికి దొరికిన మన దేశపు వింగ్ కమాండర్ అభినందన్ జీవిత చరిత్రపై బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఓ సినిమా ప్లాన్ చేసారు. ఆ కథకి విజయ్ దేవరకొండ సరిగ్గా సరిపోయాడని.. విజయ్ కి ఆ కథ చెప్పడం.. కథ నచ్చిన విజయ్ దేవరకొండ ఆ సాలిడ్ స్క్రిప్ట్ కి సైన్ చెయ్యడం జరిగింది అనే టాక్ మొదలయ్యింది. ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని.. అభినందన్ రోల్ ను విజయ్ దేవరకొండ ప్లే చేయబోతున్నాడని బాలీవుడ్ మీడియా నుండి టాలీవుడ్ మీడియా వరకు చక్కర్లు కొడుతున్న న్యూస్ .

Tags:    

Similar News