విజయ్ చాలా తెలివి మీరాడు..!

Update: 2018-07-27 07:02 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని మొత్తం తన వైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ... యూత్ పల్స్ ని బాగా పట్టేసాడు. అందుకే యూత్ కోసం రౌడీ యాప్ అంటూ హడావిడి చెయ్యడం.. తన అభిమానులతో మంచి బాండింగ్ మెయింటింగ్ చేస్తూ వారిని చేజారకుండా కాపాడుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి తో తన యాటిట్యూడ్ చూపిస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ని ప్లే చేసాడో... కానీ ఇప్పుడు తన సినిమా ప్రమోషన్స్ లోనూ అర్జున్ రెడ్డి లాజిక్ నే వాడేస్తున్నాడు. ఎలాంటి ప్రమోషన్స్ తో యూత్ కి కనెక్ట్ అవ్వొచ్చో విజయ్ బాగా తెలుసుకున్నాడు. అందుకే యూత్ కి గాలం వేస్తున్నాడు. మరి కుర్రకారు విజయ్ ఏం చేసినా ఇట్టే పడిపోతున్నారు కూడా.

అర్జున్ రెడ్డిని ఫాలో అవుతున్నాడుగా...

తాజాగా విజయ్ దేవరకొండ తన గీత గోవిందం సినిమా కోసం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు. ఆ సినిమా రొమాంటిక్ లవ్ అండ్ క్లీన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కింది. మొన్నటికి మొన్న ఆ టీజర్ ని విడుదల చేస్తూ వెరైటీగా రౌడీస్ నేను మారిపోయి... డీసెంట్ బాగా మారిపోయానంటూ ఫన్నీగా కామెంట్ చేసిన విజయ్ దేవరకొండ.. గీత గోవిందం ప్రమోషన్స్ విషయంలో దర్శకుడు పరుశురాం, నిర్మాత బన్నివాస్ లను తాను చెప్పింది వినేటట్టుగా చేసేసాడట. దర్శకుడు, నిర్మాతలు గీత గోవిందం సినిమాని.. ఫ్యామిలీస్ కి.. మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ గా పబ్లిసిటీ చేద్దామనుకున్నారట. కానీ విజయ్ దేవరకొండ మాత్రం యూత్ ని టార్గెట్ చేసేలా ప్రమోషన్స్ ని మొదలెడదామని డిసైడ్ అయ్యాడట. అందులో భగంగా తాను పాడిన పాటను బయటికి వదలడం....అలాగే 25 ఇయర్స్‌ స్టిల్‌ వర్జిన్‌ పోస్టర్ అంటూ హంగామా చెయ్యడం చూస్తుంటే అర్జున్ రెడ్డి స్ట్రేటజీని విజయ్ బాగా ఫాలో అవుతున్నాడనిపిస్తుంది.

యూత్ నే నమ్ముకుంటున్నాడా..?

మరి విజయ్ తెలివితేటలకు యూత్ నిజంగానే పడిపోయారు. ఎందుకంటే యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన పాట, అలాగే 25 ఇయర్స్‌ స్టిల్‌ వర్జిన్‌ పోస్టర్ రెండూ కుర్ర కారుని ఉర్రుతలూగిస్తున్నాయి. మరి అందుకే విజయ్ సలహాలను దర్శక నిర్మాతలు కూడా ఫాలో అవుతున్నారు. మరి కుర్ర అభిమానులకు ఒక్కసారి మనసులో పడింది అంటే.. అది ఏ రేంజ్ కి వెళుతుందో అర్జున్ రెడ్డి ప్రూవ్ చేసింది. మళ్లీ ఇప్పుడు గీత గోవిందంతో కూడా ట్రెండ్ సెట్ చెయ్యడానికి విజయ్ దేవరకొండ ఉవ్విళ్లూరుతున్నాడు. ఏది ఏమైనా విజయ్ గీత గోవిందం మీద ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలైతే ఇప్పటికే ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెంచేందుకు విజయ్ మాత్రం మరింతగా కష్టపడుతున్నాడు.

Similar News