డబ్బులు తీసుకున్నాడు... సినిమా చేయట్లేదు..!

Update: 2018-10-13 12:26 GMT

విజయ్ దేవరకొండ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మారు మోగిపోతుంది. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్నాడు విజయ్. విజయ్ ని పెట్టి సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే మనోడితో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు వస్తున్నారు. మన ఇండస్ట్రీ నుండే కాకుండా ఇతర భాషల నుండి విజయ్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు.

కన్నడ నిర్మాతతో...

రీసెంట్ గా తమిళంలో 'నోటా' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఓ కన్నడ నిర్మాత దగ్గర భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. చాలా రోజుల నుంచి విజయ్ కథలు వింటున్నాడు. కానీ అవి ఏవీ విజయ్ కి నచ్చడంలేదు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే తెలుగులో ‘పవర్’, ‘ఆటగదరా శివ’, రజనీకాంత్ తో లింగ లాంటి సినిమా నిర్మించిన రాక్‌లైన్ వెంక‌టేశ్‌ 'పెళ్లి చూపులు' ముందే ఓ పాత్ర కోసం విజయ్ ను సంప్రదించారు. అయితే ఆ పాత్ర చేయడం విజయ్ కు కుదర్లేదు.

ఇళ్లు కట్టేందుకు డబ్బు...

కానీ విజయ్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. 'పెళ్లి చూపులు' నుండి వీరు టచ్ లో ఉండటంలో విజయ్ ఇల్లు కట్టుకునే టైంలో డబ్బులు తక్కువ అయితే..ఆ సమయంలో రాక్‌లైన్ వెంక‌టేశ్‌కి కాల్ చేయ‌గా, ఆయన పెద్ద మొత్తంలో పంపించారు. అయితే స్క్రిప్ట్స్ విషయంలో కొన్ని విజయ్ కు నచ్చడం లేదు, కొన్ని వెంకటేష్ కు నచ్చడం లేదు. అలా వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలు ఎక్కట్లేదు. మరి ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Similar News