ఇద్దరు విజయ్ లను కంగారుపెడుతున్న లీక్స్!

Update: 2018-08-14 08:36 GMT

విజయ్ డెవరోకొండ నటించిన.. 'గీత గోవిందం'..'టాక్సీవాలా' రెండు సినిమాల పైరసీ గురించి ఇంకా టాలీవుడ్ లో చర్చ జరుగుతుండగా.. ఈ పైరసీ భూతం కోలీవుడ్ కి కూడా పాకింది. స్టార్ హీరో విజయ్.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'సర్కార్' సినిమాకు సంబంధించి సీన్ ఒకటి బయటికి లీక్ అయింది. ఈ సినిమాలో ఓపెనింగ్ సాంగ్ లో ఓ చిన్న బిట్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో యూనిట్ మొత్తం ఖంగుతింది.

నియంత్రిచేందుకు ప్రయత్నించినా...

ఈ సాంగ్ ను అమెరికాలో షూట్ చేసారని చెబుతున్నారు. కేవలం ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయిన సినిమా నుండి ఇలా లీక్ అవ్వడం అందరినీ కలవరపెడుతుంది. పెద్ద నిర్మాణ సంస్థల నుండి సీన్స్ లీక్ అవ్వడం అందరినీ కంగారు పెట్టిస్తోంది. కోలీవుడ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ లీక్స్, పైరసీ ను ఆపలేకపోతున్నారు. అక్కడ నటుడు విశాల్ దీనిపై చాలానే పోరాటం చేస్తున్న ఏమి ఉపయోగం లేకుండా పోతుంది. ఏది ఏమైనా ఈ పైరసీ ను ఆపాలంటే సౌత్ మొత్తం కలిసి ఒకే తాటిపై రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది రోజురోజుకి పెరిగే అవకాశం లేకపోలేదు.

Similar News