ఫాన్స్ వల్ల హీరోకి కష్టాలు ..!

Update: 2018-09-17 08:02 GMT

తమ అభిమాన హీరో తమ దగ్గరగా వస్తున్నాడు అంటేనే ఆ హీరో ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. అసలు తమకిష్టమైన హీరో కనబడితే చాలు.. ఇక ఈ జీవితానికి ఏం అక్కర్లేదు అనే ఫ్యాన్స్ కూడా ఉంటారు. హీరోలంటే ప్రాణాలు ఇచ్చేసే అభిమానులు ఉన్నారు. ఇక తన అభిమాన తారలు ఏదైనా షాప్ ఓపెనింగ్ కి వచ్చినా సరే అలాగే అభిమానులు ఎగబడిపోతారు. ఇక ఆ అభిమానులను కంట్రోల్ చెయ్యడం అనేది పోలీసులకు, బౌన్సర్లకి తలకు మించిన భారం. ఆ హీరోహీరోయిన్లు వచ్చినప్పటి నుండి వాళ్లు తిరిగి వెళ్లెవరకూ అభిమానుల నుండి ఆయా హీరోహీరోయిన్లని కాపాడలేక ఒక్కోసారి పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఘటనలు కోకోల్లలు.

పెళ్లికి వెళ్లడంతో...

తాజాగా ఈ ఫ్యాన్స్ వల్ల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి మామూలు కష్టాలు రాలేదు. ఆఖరుకి అభిమానుల తోపులాటలో విజయ్ కాలికి గాయమైంది అంటే అక్కడ అభిమానుల దాటికి విజయ్ ఎంతగా ఇబ్బంది పడ్డాడో అర్ధమవుతుంది. ఇంతకీ ఫ్యాన్స్ చేతికి విజయ్ ఎక్కడ చిక్కాడంటే.. తమిళనాట విజయ్ అభిమాన సంఘం అధ్యక్షుడు, పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కూతురి పెళ్ళికి విజయ్ కి ఆహ్వానం అందగా.. పెళ్లికి వెళ్లిన విజయ్ కి అభిమానుల సెగ తగిలింది. తమ అభిమాన హీరో విజయ్ ఈ పెళ్లికి వస్తున్నట్టుగా ఆనంద్ ముందే అభిమానులకు చెప్పడంతో.. అక్కడికి విజయ్ వచ్చేసరికి పెద్దఎత్తున అభిమానులు పొగవడంతో.. ఇదంతా జరిగిందట.

పోలీసుల రంగప్రవేశంతో...

తమ అభిమాన హీరోని చూసేందుకు విజయ్ అభిమానులు కోకొల్లలుగా అక్కడ గుమిగూడి విజయ్ ని ఉక్కిరి బిక్కిరి చేసేసారు. ఇక విజయ్ కి హెల్పర్స్ గా వచ్చిన బౌన్సర్లు కూడా అభిమానుల దాటిని తట్టుకోలేక చేతులెత్తేశారట. అక్కడ ఫ్యాన్స్ మధ్యన జరిగిన తోపులాటలో విజయ్ కింద పడిపోబోగా... విజయ్ కాలికి చిన్నపాటి గాయం కూడా అయ్యింది. మరి అక్కడి తోపులాటను, అభిమానుల తొక్కిసలాటను అదుపులోకి తెచ్చేందుకు చివరికి పోలీసులు రంగంలోకి దిగడం.. అభిమానుల మీద లాఠీఛార్జ్ చెయ్యడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి విజయ్ అక్కడి నుండి మెల్లిగా బయటికెళ్లిపోయాడట. మరి హీరో అభిమానులే హీరోకి దెబ్బలు తగిలి చెయ్యడం అనేది అభిమానుల వేర్రి అనాలి.

Similar News