విజయ్ క్రేజ్ అమ్మో.. భీబత్సం

విజయ్ దేవరకొండ అంటే యూత్ కి ఓ బ్రాండ్, ఓ క్రేజ్. విజయ్ దేవరకొండ సినిమా అంటే పడిచచ్చే యూత్ ఏ రేంజ్ లో ఉన్నారో అందరికి [more]

Update: 2020-01-05 09:17 GMT

విజయ్ దేవరకొండ అంటే యూత్ కి ఓ బ్రాండ్, ఓ క్రేజ్. విజయ్ దేవరకొండ సినిమా అంటే పడిచచ్చే యూత్ ఏ రేంజ్ లో ఉన్నారో అందరికి తెలుసు. అయినా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటే నచ్చని యాంటీ ఫాన్స్ కూడా చాలామంది ఉన్నారు. అందుకే విజయ్ దేవరకొండ ఎక్కడ దొరుకుతాడా అక్కడ నొక్కాలనే ప్లాన్ లో భాగంగా వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ విషయంలో విజయ్ అడ్డంగా దొరకటం.. యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో విజయ్ ని ఆడుకోవడం అంతా ఓ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ లో ఉందనడానికి నిదర్శనం వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ టాప్ ట్రేండింగ్ లో ఉండడమే. విజయ్ సినిమా కోసం యూత్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది.

వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 6.3 మిలియన్ వ్యూస్ తో 268k లైక్స్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది అంటే విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ లెవల్లో ఉందొ తెలుస్తుంది. మరి యాంటీ ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేసినా విజయ్ వెంట్రుక కూడా పీకలేకపోయారంటూ.. విజయ్ అభిమానులు రచ్చ షురూ చేసారు. టాప్ 10 మూవీస్ లో అత్యధిక వీక్షణలను 24 గంటల్లో సాధించిన టీజర్ గా వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ వుంది. మరి విజయ్ దేవరకొండ కు ప్రాణమిచ్చే అభిమానులుండగా యాంటీ ఫాన్స్ నిజంగానే విజయ్ ని ఏం చెయ్యలేరని అతని క్రేజ్ నిరూపిస్తుంది

Tags:    

Similar News