రౌడీ గారి స్టామినా ఇంతేనా?

నిన్నమొన్నటి వరకు విజయ్ దేవరకొండ క్రేజ్ ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భీభత్సంగా ఉంది. డియర్ కామ్రేడ్ తో కాస్త పడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరల్డ్ ఫెమస్ [more]

Update: 2020-02-13 10:23 GMT

నిన్నమొన్నటి వరకు విజయ్ దేవరకొండ క్రేజ్ ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భీభత్సంగా ఉంది. డియర్ కామ్రేడ్ తో కాస్త పడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో కాస్త రొటీన్ కి భిన్నమైన సినిమా చేసాడు. అయినా కూడా విజయ్ సినిమాపై ఇప్పుడు ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. విజయ్ గత సినిమాలకున్న క్రేజ్ అయితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. పూరి జగన్నాధ్ సినిమా పై ఉన్న హైప్, క్రేజ్, అంచనాలు అన్ని విజయ్ ని కాస్త సేవ్ చేస్తాయికి కానీ… విజయ్ మునపటి అంచనాలు మాత్రం వరల్డ్ ఫెమస్ లవర్ అందుకుంటుందా అనే డౌట్ మాత్రం ఉంది. మరి ప్రస్తతం వరల్డ్ ఫెమస్ లవర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే… రౌడీ స్టామినా ఇంతేనా అనిపిస్తుంది. కాకపోతే డిఫ్రెంట్ ప్రమోషన్స్ తో సినిమాపై కాస్త ఆసక్తిని ఆకలిగిస్తున్నాడు. మరి ఆ క్రేజీ ప్రమోషన్స్ బాక్సాఫీసు వద్ద వరల్డ్ ఫెమస్ ని ఎక్కడివరకు గట్టెక్కిస్తుందో చూద్దాం.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నైజాం 9.00
సీడెడ్ 4.00
ఆంధ్ర 10.00

టోటల్ ఏపీ & టీస్: 23.00
ఇతర ప్రాంతాలు 4.00
ఓవర్సీస్ 3.50

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్: 30.50

Tags:    

Similar News