రౌడీ గారి సైడ్ బిజినెస్ బావుందండోయ్

రెండే రెండు సినిమాల్తో యూత్ ని మొత్తం తనవైపుకు తిప్పుకుని.. చాలా తక్కువ సమయంలోనే అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికైతే [more]

Update: 2019-08-23 05:32 GMT

రెండే రెండు సినిమాల్తో యూత్ ని మొత్తం తనవైపుకు తిప్పుకుని.. చాలా తక్కువ సమయంలోనే అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికైతే డియర్ కామ్రేడ్ సినిమా ప్లాప్ తో కాస్త డల్ అయ్యాడు కానీ.. లేదంటే విజయ్ దేవరకొండ అంటే ఎనర్జిటిక్ హీరోనే. డియర్ కామ్రేడ్ పోతేనేమి.. పూరి తో సినిమా ఎనౌన్స్ చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తానంటున్నాడు. పూరి కూడా ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఫుల్ క్రేజ్ లోకొచ్చేసాడు. అయితే విజయ్ దేవరకొండ తనకున్న క్రేజ్ తో రౌడీ బ్రాండ్స్ అంటూ వస్త్ర వ్యాపారం కూడా మొదలెట్టేసాడు. రౌడీ బ్రాండ్ అంటూ మర్కెట్ ని అల్లాడిస్తున్నాడు.

అంతేనా విజయ్ కున్న క్రేజ్ తో పలు బడా కంపెనీస్ తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నారు. కోట్లు పోసి KLM ఫ్యాషన్ మాల్ వారు విజయ్ దేవరకొండ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి KLM ఫ్యాషన్స్ మీద పలు యాడ్స్ చేసారు. తాజాగా విజయ్ మరోదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడట. ఈ ఆమద్యన చాలామంది ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే లాగిన్చేస్తున్నారు. అలా ఆన్లైన్ ఫుడ్ డెలివర్ చేసే వాటిలో ప్రస్తుతం స్విగ్గి, జోమాటో లు ముందంజలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తమ బ్రాండ్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి జోమాటో సంస్థ విజయ్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి అతనికి కోటి రూపాయల పారితోషకం కూడా ఇస్తుందట. మరి విజయ్ దేవరకొండ క్రేజ్ ఇలా సైడ్ బిజినెస్ కి కూడా బాగా పనికొస్తుంది. ఒకటి రెండు సినిమాలు పోతేనేమి… ఒకే ఒక్క సినిమా హిట్ అయినా ఆ క్రేజ్ మల్లి తిరిగొచ్చేస్తుంది. మరి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత వచ్చే సినిమా హిట్ కోసం బాగా ఎదురు చూస్తున్నాడు.

Tags:    

Similar News