ఫైటర్ కోసం సిక్స్ ప్యాక్?

డియర్ కామ్రేడ్ తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. [more]

Update: 2019-11-02 12:30 GMT

డియర్ కామ్రేడ్ తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తరవాత కూడా విజయ్ మరో డైరెక్టర్ కి కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. నాని కి చైతు కి హిట్స్ ఇచ్చిన మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. ఇకపోతే వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా విడుదలకగానే పూరి ఫైటర్ కోసం విజయ్ మేకోవర్ కానున్నాడట.

ఫైటర్ కథకి తగ్గట్టుగా విజయ్ దేవరకొండ ఈ సినిమా లో సిక్స్ ప్యాక్ తో అలరించబోతున్నాడట. ఫైటర్ లో సిక్స్ ప్యాక్ బోడి కోసం ఆహార నియమాలు పాటిస్తున్నాననీ… జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాని విజయ్ దేవరకొండ చెబుతున్నాడు. ఫైటర్ సినిమా అర్జున్ రెడ్డి కి మించి ఉండబోతుండబోతుందని… ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెబుతున్నాడు. మరి విజయ్ దేవరకొండ పూరి సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. మరి మాస్ లుక్ లో విజయ్ సిక్స్ ప్యాక్ తో ఎలా ఉంటాడో అంటూ అప్పుడే విజయ్ అభిమానులు తెగ ఇదై పోతున్నారు

Tags:    

Similar News