వారిద్దరినీ రిప్లేస్ చేసిన విజయ్..!

Update: 2018-11-22 06:14 GMT

రీసెంట్ గా రిలీజ్ అయిన 'టాక్సీవాలా' ఎన్నో అనుమానాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా పైరసీ ప్రింట్ ముందుగానే రావడం.. నెగటివ్ రివ్యూస్ రావడంతో విజయ్ దేవరకొండపై సింపతీ తో.. ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు మొదటి రోజే బ్రేక్ ఈవెన్ అయ్యేలా చేసింది. అయితే థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది అనేది మాత్రం తెలియట్లేదు. 15 కోట్ల దాకా ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్.

వరుస హిట్లతో...

విజయ్ సినిమాలు చూసుకుంటే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'మహానటి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా'తో మొత్తం ఐదు హిట్స్ ఖాతాలో వేసేసుకున్నాడు విజయ్. ఈ సినిమాల మధ్యలో వచ్చిన 'ద్వారకా', 'ఏ మంత్రం వేసావో' చిత్రాలు ఎప్పుడో ఒప్పుకున్నవి కాబట్టి ఇవి లెక్కలోకి తీసుకోలేం. రీసెంట్ గా వచ్చిన 'నోటా' సినిమా తమిళ డబ్ మూవీ కాబట్టి దీన్ని కౌంట్ లోకి తీసుకోలేం. కాబట్టి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కౌంట్ ప్రకారం చూసుకుంటే విజయ్ దేవరకొండకు ఫెయిల్యూర్ రాలేదు. దీంతో మనోడి నెక్స్ట్ సినిమాల కోసం అంటే ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న 'డియర్ కామ్రేడ్'తో పాటు క్రాంతి మాధవ్ సినిమా కోసం ఇప్పటి నుండే బిజినెస్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్. విజయ్ స్క్రిప్ట్ సెలక్షన్ బాగుండటంతో మనోడికి ఇలా కలిసి వస్తుందని అంటున్నారు సినీ పెద్దలు.

మినిమం గ్యారెంటీ హీరోగా...

మినిమం గ్యారెంటీ హీరోలుగా మొన్నటి దాకా రవితేజ ఉండేవాడు. ఆ తరువాత ఆ ప్లేస్ లోకి నాని వచ్చాడు. అయితే రవితేజకు 3, నానికి 2 ఫ్లాపులు రావడంతో వాళ్ల మార్కెట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ భర్తీ చేశాడు విజయ్. విజయ్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అని దర్శక నిర్మాతలు ఎగపడుతున్నారు. ఇలానే కంటిన్యూ చేస్తే విజయ్ కు స్టార్ ట్యాగ్ కూడా పర్మనెంట్ అవుతుంది.

Similar News