పారితోషకమే కాదు... బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిందే!!

Update: 2018-12-17 05:30 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు తప్పనిస్తే.. మోస్ట్ క్రేజియస్ట్ హీరో ఎవరు అంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరే చెబుతారు. స్టార్ హీరోలకు కూడా సాధ్యంకాని... ఫీట్ ని విజయ్ దేవరకొండ హీరోగా మారిన కొద్దీ కాలానికే సంపాదించాడు. మధ్యమధ్యలో చిన్న చిన్న ప్లాప్స్ వచ్చినప్పటికీ... భారీ హిట్స్ తో ఇండస్ట్రీనే కాదు.. యూత్ ని కూడా తనవైపు తిప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో ఉన్న విజయ్ దేవరకొండ బ్రాండ్ వాల్యూ వీర లెవల్లో ఉంది. సినిమాల్లో యాప్ లో ఉండే నటీనటులు సినిమాల్లో అవకాశాలు, క్రేజ్ ఉన్నప్పుడే చేతినిండా సందించాలనే కాన్సెప్ట్ ఎప్పటినుండో ఉంది. అలాగే తారల క్రేజ్ ని బట్టి పలు కంపెనీలు తమ తమ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా తీసుకుంటారు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహెష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. హీరోయిన్స్ సరేసరి రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా విజయ్ కూడా స్టార్స్ సరసన చేరిపోయాడు. అర్జున్ రెడ్డి హిట్ కె కెఎమ్ఎల్ ఫ్యాషన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విజయ్ తర్వాత సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇక సినిమాల్లో 6 నుండి 8 కోట్లుపారితోషకము డిమాండ్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ బ్రాండ్స్ తో తెగ సంపాదించేస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ చేతిలో మరో క్రేజీ బ్రాండ్ పడిందట. సౌత్ ఇండియా నుంచి ఫ్లిక్ కార్ట్ అంబాసిడ‌ర్లుగా స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌తో పాటు ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని కూడా తీసుకుందట.

మరి ఫ్లిప్ కార్ట్ తో విజయ్ ఒప్పందం విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా కోటి రూపాయలట. విజయ్ తో మరే కంపెనీ డీల్ చెయ్యాలన్నా మినిమం కోటి చూసుకోవాలి. మరి సినిమాల్లోనూ, బ్రాండ్స్ విషయంలోనూ విజయ్ దేవరకొండ స్పీడు మాములుగా రాలేదు. అతి తక్కువ సమయంలోనే విజయ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చూడండి.

Similar News