దీనికోసమా ఇంతగా కష్టపడ్డాడు

విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ క్రేజ్ మధ్యన భారీ అంచనాలతో ఈసినిమా [more]

Update: 2019-07-27 04:57 GMT

విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ క్రేజ్ మధ్యన భారీ అంచనాలతో ఈసినిమా విడుదలైంది. యుఎస్ ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ మొదటి రోజు ఇండియాలోనూ భారీ ఓపెనింగ్స్ రాబట్టాడు. అందుకు కారణం విజయ్ కష్టం. ఎంతో కష్టపడి విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ నాలుగు భాషల్లో నిర్వహించాడు. హీరోయిన్ రష్మిక మందన్న తో కలిసి విజయ్ డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ అంటూ హైదరాబాద్, బెంగుళూరు,చెన్నై, కోచ్చిలలో హడావిడి చేసాడు. ఒక నెలన్నర నుండి డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ ని విజయ్ కంటిమీద కునుకు లేకుండా చేసాడంటే నమ్మాలి.

అంతగా సినిమా ను ప్రోమోట్ చేసి…. సినిమా మీద మంచి నమ్మకాన్ని పెట్టుకున్నాడు విజయ్. అయితే విజయ్ కష్టాన్ని, నమ్మకాన్ని ఈ డియర్ కామ్రేడ్ నిలబెట్టిందా అంటే… డియర్ కామ్రేడ్ కి ప్రేక్షకుల నుండి, రివ్యూ రైటర్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ పడినా ఈ చిత్రానికి మొదటి షోకే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ నటన, రష్మిక నటన, హీరో హీరోయిన్స్ మధ్యన కెమిస్ట్రీ, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జస్టిన్ ప్రభాకరన్ నేపధ్య సంగీతం అన్ని అద్భుతంగా సెట్ కాగా.. భరత్ కమ్మ దర్శకత్వం, కథ, కథనంలో లోపం, స్లో నేరేషన్, గ్రిప్పింగ్ కామెడీ లేకపోవడం, విజయ్ చేసిన పాత్ర అర్జున్ రెడ్డి సినిమాలోనూ ఆర్జున్ రెడ్డి పాత్రని పోలి ఉండడం, ఎడిటింగ్ లో లోపం, నిడివి ఎక్కువ కావడం వంటి నెగెటివ్ పాయింట్స్ తో సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే విజయ్ చేసిన ప్రమోషన్స్ చూసాక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా చూసాక విజయ్ డియర్ కామ్రేడ్ మీద అతిగా ఊహించుకున్నాడు అనిపిస్తుంది.

Tags:    

Similar News