విజయ్ పక్కన రాశి?

Update: 2018-08-15 05:53 GMT

'అర్జున్ రెడ్డి' సినిమాతో ఆమాంతం తన ఇమేజ్ పెంచుకున్న విజయ్ ను రీసెంట్ గా అల్లు అరవింద్ ఇతను కచ్చితంగా వంద సినిమాలు చేయటం ఖాయం అని కితాబిచ్చాడు. మరీ అతని టాలెంట్ అటువంటిది. ఇక ఇతను నటించిన 'గీత గోవిందం' చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అయ్యిపోయాయి. పెద్ద హీరోస్ సినిమాలకి బుకింగ్ అయ్యినట్టు ఇతని సినిమాకి అయ్యాయి అంటే మనోడు రేంజ్ ఏంటో అర్ధం అయ్యిపోతుంది.

మరీ ఇటువంటి క్రేజీ హీరో పక్క ఏ హీరోయిన్ కు చేయాలనుండదు చెప్పండి. ఒకేవేళ ఈ హీరో పక్కన ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోవాలి కదా. అయితే అలంటి పరిస్థితి రాశి ఖన్నా కు వచ్చిందంట. క్రాంతి మాధవ్ డైరెక్షన్ విజయ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా అయితే బాగుంటది అని అనుకుంటున్నారట. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్. రామారావు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న 'నోటా'.. 'డియర్ కామ్రేడ్' సినిమాల తర్వాత విజయ్..క్రాంతి మాధవ్ తో చేస్తాడు. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా క్రాంతి మాధవ్ ఈ సినిమా కథ తయారు చేసుకున్నాడని సమాచారం. 'గీత గోవిందం' తర్వాత 'టాక్సీవాలా' రిలీజ్ కు రెడీ గా ఉంది.

Similar News