‘అర్జున్ రెడ్డి’ మూడ్ నుండి బయటికి రాలేకపోతున్నాడా?

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘అర్జున్ రెడ్డి’. రెండో సినిమాతో విజయ్ దేవరకొండ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో స్టూడెంట్ గా [more]

Update: 2019-07-27 04:18 GMT

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ‘అర్జున్ రెడ్డి’. రెండో సినిమాతో విజయ్ దేవరకొండ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో స్టూడెంట్ గా తాగుబోతు డాక్టర్ గా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అద్భుతమైన నటన కనబర్చాడు. ఆ సినిమా తర్వాత ‘గీత గోవిందం’ లోను విజయ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ రెండు హిట్స్ తోనే విజయ్ మార్కెట్, క్రేజ్ అన్ని పైపైకి ఎదిగిపోయాయి. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత చెయ్యాల్సిన ‘డియర్ కామ్రేడ్’ ని విజయ్ దేవరకొండ రెండు మూడు భారీ హిట్స్ అందుకున్నాక చెయ్యడం సాహసమే. అయితే సినిమా కథ మీద నమ్మకంతో విజయ్ ఈ సినిమా చేసాడు. చెయ్యడమే కాదు సినిమాకి ఓ రేంజ్ ప్రమోషన్స్ నిర్వహించాడు కూడా.

అయితే విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ కి సూపర్ హిట్ టాక్ పడకపోయినా.. యావరేజ్ టాక్ పడింది. విజయ్ క్రేజ్ తో ఆ యావరేజ్ టాక్ కాస్త హిట్ టాక్ గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామ్రేడ్ గా బాబీ పాత్రలో విజయ్ నటన సూపర్. కోపావేశాలు కలిగిన స్టూడెంట్ గా విజయ్ కనిపిస్తాడు. అయితే ‘డియర్ కామ్రేడ్’ లోని బాబీ పాత్రకి ‘అర్జున్ రెడ్డి’లోను అర్జున్ పాత్రకి పెద్ద తేడా కనిపించలేదు. ఎందుకంటే ఆర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ నటన, ఆయన స్టయిల్ అలాంటివి. ఇప్పటికి విజయ్ అభిమానులు అర్జున్ రెడ్డి పాత్రలోనే విజయ్ ని ఊహించేసుకుంటున్నారు. ఇక విజయ్ కూడా ఆ అర్జున్ రెడ్డి పాత్ర నుండి బయటికి రాలేకపోయాడనిపిస్తుంది.. డియర్ కామ్రేడ్ లో బాబీ పాత్రని చూస్తే. అర్జున్‌రెడ్డిలో చేసినవి చాలానే ఈ సినిమాలో రిపీట్‌ చేసాడు. బాబీ పాత్రపై అర్జున్‌రెడ్డి ప్రభావం చాలానే క‌నిపిస్తుంది. సినిమాలోని చాలా స‌న్నివేశాల్లో విజయ్ దేవరకొండ సిగ‌రెట్‌ కాలుస్తూ క‌నిపించ‌డం, అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్పడం ఇలా చాలా విషయాలు అర్జున్‌రెడ్డి పాత్రని గుర్తు చేస్తాయి. బాబీ క్యారెక్టరైజేషన్ పై అర్జున్ రెడ్డి ప్రభావం నూటికి నూరు పాళ్లు వుంది. ఇక ఈ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం వల్ల బిల్డప్ లు ఎక్కువై, అనవసరపు సీన్లు అనేకం చోటుచేసుకున్నాయి. అందుకే సినిమా లెంత్ కూడా ఎక్కువైంది అనే భావన కలుగుతుంది. ఏది ఏమైనా విజయ్ మాత్రం ‘అర్జున్ రెడ్డి’ మూడ్ నుండి బయటికి రాలేకపోతున్నాడనేది మాత్రం అర్ధమవుతుంది.

Tags:    

Similar News