విజయ్ కోసం ముంబై మోడల్?

దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే కొత్త నటుల్ని కాదు.. కొత్త హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూనే ఉంటాడు. పూరి జగన్నాధ్ స్కూల్ నుండి వచ్చిన [more]

Update: 2019-12-23 06:54 GMT

దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే కొత్త నటుల్ని కాదు.. కొత్త హీరోయిన్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూనే ఉంటాడు. పూరి జగన్నాధ్ స్కూల్ నుండి వచ్చిన హీరోయిన్స్ చాలామంది టాప్ మోస్ట్ హీరోయిన్స్ అయినా వారు ఉన్నారు. ఇక కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలకే చుట్టేశారు. అయితే తాజాగా పూరి జగన్నాధ్ తన ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ కోసం సేఫ్ గేమ్ గా బాలీవుడ్ నుండి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని దింపుతున్నాడు. శ్రీదేవి కూతురు అనగానే సౌత్ లో సాఫ్ట్ కార్నర్ రావడం ఖాయం, ఇక బాలీవుడ్ లో ఎలాగూ జాన్వికి ఓ క్రేజ్ ఉంది. సో జాన్వీ కపూర్ తో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు పూరి జగన్నాధ్ అని అనుకున్నంతలో ఇప్పుడు పూరి మరో హీరోయిన్ కోసం వెతుకున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

విజయ్ దేవరకొండ కోసం ఇప్పుడు మరో హీరోయిన్ ని పూరి సెట్ చేయబోతున్నాడట. ఎప్పటిలాగే ఓ కొత్త అమ్మాయి కోసం పూరి సెర్చింగ్ చేస్తున్నాడని, ఫాస్ట్ గా ఉండే ముంబై మోడల్ అయితే బావుంటుందని పూరి, విజయ్ కోసం ఓ ముంబై మోడల్ ని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. మరి ఇప్పటికే పాన్ ఇండియా ఫిలిం గా ఫైటర్ ని మార్చిన పూరి ఇప్పుడు ఆ సినిమా కోసం భారీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.

Tags:    

Similar News