విజయ్ తో పూరి ఏం చేస్తున్నాడు

రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా తక్కువ సమయంలో షూట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేసి మరో సినిమా ను లైన్ లో పెట్టడం పూరి [more]

Update: 2019-08-21 06:09 GMT

రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా తక్కువ సమయంలో షూట్ చేసి ఆ సినిమాని రిలీజ్ చేసి మరో సినిమా ను లైన్ లో పెట్టడం పూరి కి అలవాటు. సినిమాకి సినిమాకి మధ్యలో అసలు గ్యాప్ తీసుకోకుండా చాలా త్వరగా ఫినిష్ చేయడం పూరి స్టైల్. రీసెంట్ గా పూరి ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకుని వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా ను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆల్రెడీ ఈసినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోందట. తాజాగా సోషల్ మీడియా లో పూరి అండ్ విజయ్ కలిసొన్న ఫోటో ఒకటి వైరల్ అయింది. తమ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ లోకేషన్స్ కోసం వేట మొదలుపెట్టారని.. ఈ ఫోటోను చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.

నిజంగానే లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారా? లేదా స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయా? అనేది తెలియాల్సిఉంది. ఏది ఏమైనా పూరి – విజయ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూరి సాధారణంగానే తన హీరోస్ కి చాలా డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటాడు. మరి ఈమూవీ లో విజయ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది ఇప్పటినుండే ఆసక్తి మొదలయింది.

Tags:    

Similar News