అలా అనుకున్నామో లేదో..?

పూరి జగన్నాధ్ డైరెక్షన్ స్పీడు ఎలా ఉంటుందో అందరికి తెలుసు. పూరి కథ ప్రిపేర్ అయ్యి సెట్స్ మీదకెళ్ళాడు అంటే ఆ సినిమా 6 నెలల్లో పూర్తి [more]

Update: 2020-02-01 04:28 GMT

పూరి జగన్నాధ్ డైరెక్షన్ స్పీడు ఎలా ఉంటుందో అందరికి తెలుసు. పూరి కథ ప్రిపేర్ అయ్యి సెట్స్ మీదకెళ్ళాడు అంటే ఆ సినిమా 6 నెలల్లో పూర్తి చేసి పారేసి.. సినిమాని విడుదల చేస్తాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా అనుకుని మూడు నెలలు కావడం.. విజయ్ దేవరకొండ కూడా వరల్డ్ ఫెమస్ లవర్ షూట్ పూర్తి చేసుకుని.. ఫ్రీ కావడంతో ఫైటర్ సినిమాని పాన్ ఇండియా మూవీ గా పూరి పట్టాలెక్కించాడు. నిన్నగాక మొన్న మొదలైన ఫైటర్ సినిమా షూటింగ్ అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుందట.

పది రోజుల పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో ఫైటర్ ఫస్ట్ షెడ్యూల్ ని పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో కలిసి యమ ఫాస్ట్ గా పూర్తి చేసాడు. ఇప్పటికే ఛార్మి షూట్ సిరీస్ అంటూ తన ఫొటోస్ పోస్ట్ చేస్తున్నప్పుడే అనుకున్నారు పూరి స్పీడు మామూలుది కాదని. మరి పూరి డైరెక్షన్ స్పీడు… కి విజయ్ దేవరకొండ క్రేజ్, ఎనేర్జి తోడైతే.. ఈసినిమా ని మనం ఆరు నెలలోనే చూడొచ్చేమో. ప్రస్తుతం హీరోయిన్ విషయం ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఫైనల్ గా పూరి – విజయ్ సినిమా హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ గర్ల్ అనన్య పాండే అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

Tags:    

Similar News