హీరో ప్లేస్ లో ఫైటర్

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చేస్తున్న టైములో ‘హీరో’ అనే సినిమా చేసాడు. అది ఎందుకనో సడన్ గా ఆగిపోయిందని చెప్పారు. అవి ఉట్టి పుకారులే అని [more]

Update: 2019-09-22 10:01 GMT

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చేస్తున్న టైములో ‘హీరో’ అనే సినిమా చేసాడు. అది ఎందుకనో సడన్ గా ఆగిపోయిందని చెప్పారు. అవి ఉట్టి పుకారులే అని చాలామంది అన్నారు. కానీ లేటెస్ట్ గా విజయ్ కొంతమంది మీడియా ప్రతినిథులతో ఆఫ్-ది రికార్డు మాట్లాడారు. అప్పుడు విజయ్ “అవును హీరో సినిమా ఆగిపోయిందని” చెప్పాడు తప్ప ఎందుకు ఆగింది మాత్రం చెప్పలేదు. దాని ప్లేస్ లో పూరి తో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్న అని చెప్పాడు.

కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా సడన్ గా ఆగిపోవడానికి కారణాలు ఏవైనా ఆ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కి 8-9 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ ఆనంద్ అన్నామళైకి కొంత ముట్టజెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకున్నారు మైత్రి వాళ్ళు. అలానే మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్, ప్రొడక్షన్ వాళ్ళకి మైత్రి వాళ్ళు అంత సెటిల్ చేసి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ నష్టం ని భర్తీ చేసేందుకు మైత్రి బ్యానర్ లోనే విజయ్ మరో సినిమా చేస్తా అని హామీ ఇచ్చాడట. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అలానే త్వరలోనే పూరి తో ఫైటర్ అనే సినిమా చేయనున్నాడు.

Tags:    

Similar News