విజయ్ దేవరకొండ ప్లాన్ అదా?

అన్ని విషయాల్లో అంటే సినిమాల విషయంలో, వ్యాపారం విషయంలో పక్కా ప్లాన్ తో ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు పక్కాగా రాంగ్ స్టెప్ వేసాడనిపిస్తుంది. క్రాంతి మాధవ్ [more]

Update: 2019-11-20 06:12 GMT

అన్ని విషయాల్లో అంటే సినిమాల విషయంలో, వ్యాపారం విషయంలో పక్కా ప్లాన్ తో ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు పక్కాగా రాంగ్ స్టెప్ వేసాడనిపిస్తుంది. క్రాంతి మాధవ్ తో సినిమాకి కమిట్ అయ్యి తప్పుచేసాడేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కారణం వరల్డ్ ఫెమస్ లవర్ ని విజయ్ దేవరకొండ అస్సలు పట్టించుకోవట్లేదని ప్రచారం షురూ అయ్యింది. పూరి ఫైటర్ కోసం తయారవుతున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫెమస్ లవర్ ని పక్కన పడేసాడని.. లేదంటే డిసెంబర్ లో విడుదలనుకుంటే కనీసం ప్రమోషన్స్ లేవంటున్నారు.

అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన సినిమాని డిసెంబర్ లో వదిలే ఉద్దేశ్యం లేదు. ఎందుకంటే డిసెంబర్ క్రిష్టమస్ కి నాలుగైదు సినిమాలున్నాయి. అప్పుడు ఖచ్చితంగా విజయ్ రాడు.ఇక జనవరి లో సంక్రాంతికి పెద్ద హీరోల సందడి. తర్వాత అంటే మళ్ళీ ఫిబ్రవరికి వరల్డ్ ఫెమస్ లవర్ విడుదల చెయ్యాలి. అయితే ఫిబ్రవరి రెండో వారం లవర్స్ డే రోజున వరల్డ్ ఫెమస్ లవర్ ని దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మూవీ టీం ఉందట. అందుకే విజయ్ ప్రస్తుతం కూల్ గా ఉన్నాడని, వరల్డ్ ఫెమస్ లవర్ గురించి ఆలోచన చెయ్యడం లేదని అంటున్నారు. మరి డిసెంబర్ రెండో వారం నుండి వరల్డ్ ఫెమస్ లవర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. ఫిబ్రవరి కల్లా సినిమాపై క్రేజ్ తేవాలని విజయ్ దేవరకొండ ప్లాన్ గా చెబుతున్నారు.

Tags:    

Similar News