విజయ్ పెద్ద ప్లానే వేశాడుగా..!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ లో గుర్తుండిపోయే ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. [more]

Update: 2019-04-27 07:27 GMT

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ లో గుర్తుండిపోయే ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చి ‘డియర్‌ కామ్రేడ్‌’ అనే డిఫరెంట్ జోనర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో యాభై కోట్ల వరకు బిజినెస్‌ జరుగుతుంది. ముల్టీపుల్ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ తమిళం, మలయాళం, కన్నడంలో కూడా మార్కెట్ ఏర్పరుచుకోనున్నాడు.

వంద కోట్ల మార్కెట్ కోసం

విజయ్ తన తదుపరి చిత్రాలని మాత్రం మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో చేయాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా మిగిలిన రాష్ట్రాల్లో కూడా యాభై కోట్ల బిజినెస్‌ వరకు రీచ్‌ అయితే తన మార్కెట్‌ కూడా వంద కోట్లకి చేరుకునే వీలుంటుంది. చాలామంది మన తెలుగు స్టార్స్ ఇటువంటి ఫీట్స్ చేసి ఉన్నారు. కానీ ఎవరూ అంతగా క్లిక్ అవ్వలేదు. మరి విజయ్ ఎంతవరకు క్లిక్ అవుతాడో చూద్దాం. ‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రస్తుతం రీషూట్ లో ఉంది. మే 1న మరో సాంగ్ రిలీజ్ చేసే అవకాశముంది.

Tags:    

Similar News