తన ప్లాన్ – బి ఏంటో చెప్పిన విజయ్..!

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని రెండో సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని టాలెంట్ ను నిరూపించుకున్న విజయ్ ఆ [more]

Update: 2019-01-28 07:46 GMT

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని రెండో సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తనలోని టాలెంట్ ను నిరూపించుకున్న విజయ్ ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’తో తనకున్న మార్కెట్ స్థాయి ఏంటో చెప్పాడు. ఈ రెండు సినిమాలకి మార్కెట్ కూడా రావడంతో మనోడితో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

ఇండస్ట్రీని వదిలేది లేదు…

ఒకవేళ తను నటుడిగా ఫెయిల్ అయితే తనకి ఎల్లప్పుడూ ‘ప్లాన్ బి’ ఆప్షన్ ఉందని తెలిపాడు. ఇంతకీ ఆ ప్లాన్ బి ఏంటంటే… స్క్రిప్ట్ రైటర్ గా లేదా డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ మారతాడట. అయితే తనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను మాత్రం సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News