కోర్టుకెక్కిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఒక విచిత్రమైన వివాదం నేపథ్యంలో కోర్టుకి ఎక్కాడు. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునే పనిలో ఉన్న విజయ్ [more]

Update: 2019-02-27 07:43 GMT

టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఒక విచిత్రమైన వివాదం నేపథ్యంలో కోర్టుకి ఎక్కాడు. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునే పనిలో ఉన్న విజయ్ తెలుగుతో పాటు తమిళంలో సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో తన ఇమేజ్ ని కర్ణాటకలో కూడా వ్యాప్తి చేసుకున్నాడు. అక్కడ మనోడి సినిమాలకి క్రేజ్ ఎక్కువ. ఈ క్రేజ్ ని కాష్ చేసుకోవాలని బెంగుళూరుకి చెందిన ఓ గార్మెంట్ కంపెనీ మాస్టర్ ప్లాన్ వేసి రౌడీ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో టీషర్ట్స్, షాట్స్ లాంటి దుస్తుల్ని అమ్ముకోవడం స్టార్ట్ చేసింది.

రౌడీ వేర్ నాదే అంటూ…

బిజినెస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ దుస్తులను అమెజాన్ ఆన్లైన్ వెబ్‌సైట్ లో పెట్టి అమ్మడంతో విషయం తెలుసుకున్న విజయ్ ‘నా రౌడీ బ్రాండ్‌ని దొబ్బేశారు మొర్రో’ అంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసాడు. రౌడీ బ్రాండ్ అనేది నాదేనంటూ కోర్టుకెక్కాడు. మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఒక పక్క విజయ్ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క బిజినెస్‌లో కూడా రాణిస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాను పూర్తి చేసుకుని క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News