చాలా కష్టాలు పడ్డనంటున్న విజయ్

Update: 2018-06-19 05:49 GMT

వారసత్వంతో కాకుండా జనరల్ గా ఒకేఒక్క సినిమాతో స్టార్ హీరోలు అవ్వడం చాలా కష్టం. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక సినిమాతోనే సక్సెస్‌ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ అలానే వచ్చి సింగల్ నైట్ లో స్టార్ హీరో అయ్యిపోయాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘పెళ్ళిచూపులు’ లాంటి విజయాలున్నప్పటికీ.. అతనికి హీరోగా అంత పేరు రాలేదు. కానీ 'అర్జున్ రెడ్డి' సినిమాతో మాత్రం స్టార్ డం వచ్చేసింది.

తన ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా పెరిగింది. దాంతో తెగ సినిమాలు వచ్చి పడుతున్నాయి. కానీ ‘పెళ్ళిచూపులు’ చిత్రం కి ముందు తన పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అంటున్నాడు విజయ్. తాను సినిమాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని.. కానీ అనుకోకుండా వచ్చానని.. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చేశాక నేను ఇక్కడ స్థిరపడగలనని నమ్మకం కలిగిందని..సినిమాలు వరసగా వస్తాయని ఆశించానని.. కానీ ఆలా జరగలేదని.. దాదాపు ఏడాదిపైనే ఖాళీగా ఉన్న అని చెప్పాడు.

ఏం చేయాలో తెలియక నిర్మాతలైన స్వప్న, ప్రియాంకలను గైడెన్స్ అడిగానని చెప్పాడు. వాళ్లు రికమండ్ చేస్తేనే నాకు ‘పెళ్ళిచూపులు’ ఛాన్స్ వచ్చిందని చెప్పాడు. అలానే ‘అర్జున్ రెడ్డి’ విషయంలోనూ వాళ్లే సాయం చేశారని విజయ్ వెల్లడించాడు. 'అర్జున్ రెడ్డి' తో వచ్చిన గుర్తింపు అంత ఇంత కాదని... చిరంజీవి.. బాలయ్య.. వెంకటేష్ లాంటి స్టార్ హీరోస్ తో నన్ను ఫిలిం ఫేర్ లో నామినేట్ చేసారని.. ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంటుంటే తనకు మాటలు రాలేదని విజయ్ తెలిపాడు

Similar News